Saturday, 26 March 2016

చిన్నూ

నాలుగు నెలల మన పరిచయం ... 
ఎంత మధురం .... 
నీ .. సమాచారం కోసం ఎదురు చూడ్డం లో 
ఎంత ఆత్రుత పడతానో 
తెలుసుకున్నాక .. హమ్మయ్యా ! అనుకుంటా 
ప్రతినెలా నాకు తెలిసిన కొన్ని మాటలు రాయడం 
చిన్నూ !  ఎలా వున్నాయి  అని  అడగడం .... 
నువ్వేమో బావుంది అని చెప్పడం 
కాని నువ్వు ఒక్కటీ రాసింది  లేదు 
కొంచెం నిరుత్సాహం ... ఎప్పుడైనా ఒక ముక్క
నా కోసం రాస్తావేమో అని ఆశ .. 
ఒద్దు ... రాయొద్దు .. అడిగి రాయించుకోవడం 
బాగుండదు .. 
ఈ నాలుగు నెలల కాలం లో 
నిన్ను  కలుసుకున్న క్షణాలు 
చాల మధురమైనవి .. ఆ అపురూప క్షణాలను 
ఎప్పటికి మర్చిపోలేను 
ఏదో ఒకరోజు  దూరమైపోతామేమో అని భయం 
భయం తోనే రోజు నువ్వు మెసేజ్ చేస్తే 
ఎంత  బాగుంటుందో కదా అని ఆశ 
ఆ ఆశ తోనే కొత్త నెల లోకి అడుగుపెడుతూ .... 
 ఉంటా  మరి ..... 

Tuesday, 15 March 2016

 అక్కా ,
శనివారం .. సికింద్రాబాద్ స్టేషన్ :
ప్లాట్ ఫాం నెంబర్ 2
అక్కా ! ఎక్కడున్నావు ?? నేనొస్తున్న కన్నా
దిగిన  చోటే ఉండు . వొస్తున్నా  అన్నావు
సడన్ గ ప్రత్యక్షమయ్యవు .. నా గుండె శబ్దం
నాకే వినిపిస్తోంది .. ఎదురుగా మా అక్క
చిరునవ్వుతో .. గట్టిగ వాటేస్కోని బుగ్గల మీద
కళ్ళ మీద ముద్దు పెట్టేసి అమ్మా నీకొడుకుని
వచ్చేసానమ్మా ! అని చెప్పాలనుకున్నా
కానీ , నాకు మాటరావడంలేదు
పాపం   నువ్వే డ్రింక్ ఓపెన్ చేసి   ఇచ్చావు
బ్యాగ్ ఇవ్వు నాన్నా అని అడిగావు  అక్కే కనిపించింది
ఆ మాటల్లో ..
బయటికి వచ్చేసాక .. కాబ్ కోసం నిలబడక్కరలేకుండానే
ఏర్పాటు చేయించేసావు .. నీ టైమింగ్  మెచ్చుకోకుండా ఉండలేను
ఇంటికి వచ్చాకా .. డాడీ ని పరిచయం చేసావు
ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని నన్ను
నీ ప్రేమతో ఇంటికి రప్పించుకున్నావు
చిన్నమ్మా .. తలనొప్పి . అంటే బాధపడ్డావు
ఆయిల్ మసాజ్ చేసావు అప్పుడు అక్కని చూసా నీలో
చాల సేపు కబుర్లే కబుర్లు ...
ఎన్ని ముచ్చట్లో ...నాన్నా ఒళ్లో తలపెట్టుకుంటా అన్నావు
అక్కే అచ్చంగా .. ఆ పిలుపులో  ఏ తేడా  లేదు
నిన్ను చూసి ఏమైపోయినా పరవాలేదు నాకు
ఇదే నేను రోజూ దేవునికి ప్రార్ధించేవాణ్ణి
చివరకు దేవుడే కలిపాడు .. ఇదే నా  విశ్వాసం
చిన్నూ ..  అన్ని సవ్యంగా జరిగితే ఇద్దరం రావాలనుకున్నాం
కాదు ముగ్గురం .. హహహః ..
కానీ ..  వచ్చాను  ఒంటరిగా ..