చిన్నూ
నాలుగు నెలల మన పరిచయం ...
ఎంత మధురం ....
నీ .. సమాచారం కోసం ఎదురు చూడ్డం లో
ఎంత ఆత్రుత పడతానో
తెలుసుకున్నాక .. హమ్మయ్యా ! అనుకుంటా
ప్రతినెలా నాకు తెలిసిన కొన్ని మాటలు రాయడం
చిన్నూ ! ఎలా వున్నాయి అని అడగడం ....
నువ్వేమో బావుంది అని చెప్పడం
కాని నువ్వు ఒక్కటీ రాసింది లేదు
కొంచెం నిరుత్సాహం ... ఎప్పుడైనా ఒక ముక్క
నా కోసం రాస్తావేమో అని ఆశ ..
ఒద్దు ... రాయొద్దు .. అడిగి రాయించుకోవడం
బాగుండదు ..
ఈ నాలుగు నెలల కాలం లో
నిన్ను కలుసుకున్న క్షణాలు
చాల మధురమైనవి .. ఆ అపురూప క్షణాలను
ఎప్పటికి మర్చిపోలేను
ఏదో ఒకరోజు దూరమైపోతామేమో అని భయం
భయం తోనే రోజు నువ్వు మెసేజ్ చేస్తే
ఎంత బాగుంటుందో కదా అని ఆశ
ఆ ఆశ తోనే కొత్త నెల లోకి అడుగుపెడుతూ ....
ఉంటా మరి .....
No comments:
Post a Comment