Saturday, 30 January 2016

అక్క

అక్కా! మన పరిచయానికి మూడునెలలు ...
 మూడు రోజుల్లా గడిచిపోయింది కదా !
మూడు నెలల్లో ఎంత మార్పు చెప్పు...
ఎన్ని మధుర స్మృతులో ... ఎన్ని మార్పులో ..
సుప్రియ వెళ్ళిపోయింది , ఇంకొకరు వచ్చి వెళ్లారు ...
కమల ఇల్లాలయ్యింది .. ఎలా వచ్చిందో ?
తలుచుకుంటే నవ్వు .... ఆశ్చర్యం ..,
ఇద్దరం కూర్చున్నప్పుడు నిన్నే తలుచుకుంటాం ..
తను నిన్నే అమ్మ అనుకుంటాను అంటుంది ...
ఇప్పుడు ఒక కళాశాలలో అధ్యాపకురాలిలా ...
నాకు భార్యగా .. అప్పటి కమల కి ఇప్పటి కమలకి
ఏ మాత్రం పోలిక లేదు .
చిన్నూ ! నేను ఇండియా వస్తున్నానోచ్ ...
అని నువ్వు చెప్పిన రోజు చాలా  సంతోషపడ్డాం
నువ్వు మొదట చెప్పిన మాట నిన్ను కలుసుకోవాలి కన్నా ! అని
ఆ రాత్రంతా కబుర్లు చెప్పుకున్నాం ..
 అప్పటినుండి ఎప్పుడు , ఎక్కడ , ఎలా కలుసుకోవాలో ..
చాలా ప్లాన్స్ ,, ఇంకా ఏం మాట్లాడుకోవాలో ...
  నా సంతోషాన్ని ఎలా పంచుకోవాలో .. ప్లానింగ్ ..
చిట్టీ ,,, కాకినాడలో కలుసుకుందామా ..
సరే కన్నా !.. ఒద్దు నేనే నీ కోసం హైదరాబాద్ వచ్చేస్తా !
రాలేనేమో .. కొంచెం అనుమానం
మళ్లీ .. అక్కా .. ప్రమోషన్ ఇంకా బదిలీ ..
ఇప్పుడో మారుమూల ప్రాంతం .. వెళ్ళాలంటే ఇష్టం లేదు
వెళ్ళాలి కన్నా ! ఉద్యోగం  మానెయ్యకూడదు రా ...
నీ మాటలు వింటే కొంచెం ధైర్యం ..
కమల ఏడుస్తున్నా బయలు దేరుతున్నా ....
చిన్నూ ! ఫోన్ చెయ్యడం మరిచిపోకేం ..
నువ్వు మాట్లాడడం మానేస్తే నేను ఏమీ తినను ...
ఎలా వెళ్ళడం ?? కమలని వదిలి వెళ్ళలేను అంటే
నాన్నా ! కొన్ని రోజులు తప్పదురా ! అని పంపించావు ..
చిన్నూ ! ఇక్కడంతా ఉండలేని  పరిస్థితి అంటే .
తప్పదు కదా కన్నా , నేను  చెప్తాను కదా రోజూ .. అంటూ
వెళ్ళడానికి ఒప్పించావు .. అక్కా నువ్వు కమలని
బాగా చుస్కొ.. నేను వెళ్లి వొస్తా ...
కొత్త ప్రపంచం లోకి కొత్త ఆశలతో .. ఎప్పటికైనా
నిన్ను ... నా కమలని ఒకేసారి చూస్తాను  అనే ఆశతో
మన  మూడవ  నెల పరిచయాన్ని తలుచుకొంటూ
వెళ్ళొస్తా ..... నీ తమ్ముడు ..



Wednesday, 20 January 2016

నా డైరీ లో కొన్ని పేజీలు :
ఆదివారం ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాను . రోజులు చాల భారంగా గడుస్తున్నాయి . మూడు రోజులు మూడు యుగాలుగా గడిచాయి .. అక్కా సుప్రియ  వాళ్ళు ఈ రోజు వస్తారా ? అడిగాను అక్కని .. ఏమోరా ! చిన్నా వస్తామని అన్నారు  కానీ నాకు మాత్రం నమ్మకం చాలడం లేదు రా .. వస్తారో రారో నేను చెప్పలేను అంది అక్క . తను కొంచెం కూడా నా బాధని పంచుకోడం లేదు . ఛీ ఇలాంటి అక్క కూడా వుంటుందా అని చాలా బాధ పడ్డాను .. సుప్రియ వస్తే బాగుండేది అని ఆలోచిస్తూ  ఉండిపోయాను .
సరిగ్గా 9 గంటలకి అక్క పిలిచింది .. చిన్నా ! మా స్కూల్ కి వెళ్లి లీవ్ లెటర్ ఇచ్చి రా ! టీచర్స్ దారిలో కనిపించారు కదా అని వాళ్ళకి ఇచ్చేయ్యకు సరేనా ? జాగ్రత్త గా వెళ్లి రా అంది . అక్కా స్కూల్ కి నిన్నే లీవ్ ఇవ్వలేకపోయావా ? ఇప్పుడు సుప్రియ వస్తుందని నేను చూస్తున్నాను .. అన్నాను .. చిన్నా ! ఫీవర్ గా వుంది రా వెళ్ళవూ .. అంది అక్క ..  అది కాదక్కా .. వాళ్ళొస్తారు కదా . ఉండకపోతే సుప్రియ ఫీల్ అవుతుంది కదా అని ..
చిన్నా వాళ్లోస్తే నీకోసం ఉండరా ?? అయినా వాళ్ళొస్తారొ రారో కూడా తెలీదు .. మనకి ఇంటిమేట్ చెయ్యలేదమ్మ .. అంది ..జాగ్రత్తగా  వెళ్లి రా దేనికైనా మంచిది  వచ్చేటప్పుడు విజయనగరం వెళ్లి స్వీట్స్ ఇంకా పువ్వులు తీసుకొని రా .. ట్రాఫిక్ లో జాగ్రత్త నాన్నా ! అంది .. అక్కా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ? వాళ్ళు వస్తారో రారో!  అంటున్నావ్ కదా అడిగాను నేను . అది కాదు చిన్నా వాళ్ళు వచ్చాక  మనం వెళ్లి తెచ్చుకుంటామా .. బాగోదు కదరా ! వెళ్లి వస్తావా మరీ ! అంది.   అక్కా! నాకు టెన్షన్ గా వుంది . కాని తొందరగా వెళ్లి వచ్చేస్తాను అన్నాను . చిన్నా ! నెమ్మదిగా వెళ్లి రా .. బైక్ మీదా వెళ్ళు అంది . అక్కా ! సరే వెళ్ళొస్తా .. సుప్రియ వస్తే ఉండమను . వెంటనే పంపించెయ్యకు .. అన్నాను .. చిన్నా ! మరీ చిన్న పిల్లోడిలా మాట్లాడకు .. వెళ్లి రా అంది అక్క .
నేను అక్క ని మనసులో తిట్టుకుంటూ బయలు దేరాను .. తిన్నగా స్కూల్ కి వెళ్లి లీవ్ లెటర్ ఇచ్చి బయలు దేరాను .మళ్లీ  విజయనగరం వెళ్లి అక్క చెప్పినవన్నీ కొనుక్కొని తిన్నగా  ఇంటికి ..  ఇంటి ముందు కారు ఆగి వుండడం చూసాక నా గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలయింది .. అబ్బా సుప్రియ ఎలా వుందో చూద్దాం .. మనసు తొందర పెట్టింది . చిన్నా వాళ్ళొచ్చారు రా .. కానీ సుప్రియని తీస్కొని రాలేదు . సారీ ఇలా జరుగుతుందనుకోలేదు .. సరే నువ్వు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడు . ఫీలౌతారు .. అంటూ అక్క వంట గదిలోకి దూరింది .. ఏమీ చెయ్యలేక వాళ్ళని పలకరించి  కూర్చున్నా ..  కాసేపు అయ్యాకా అక్క అంది చిన్నా ! బట్టలు బాగోలేవు మార్చుకొని రా బాగులేదు అంది .. నాకు చాల కోపంగా వుంది .. కాని ఏమీ అనలేక మౌనం గా నా బెడ్రూం   తీసాను .. లోపలి వెళ్లి తలుపు మూసెయ్య బోతుంటే .. సుప్రియా ఎదురుగా .. ఒక్కసారి గట్టిగ అరిచాను .. సంతోషంతో . సుప్రియ నన్ను బలంగా తనవైపుకు లాక్కొని గట్టిగా ముద్దు పెట్ట్టుకుంది . నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను .. సరే సుప్రియా మనం ఒక గేమ్ ఆడుదాం .. నువ్విక్కడే మౌనం గా కూర్చో అంటూ బట్టలు మార్చేసుకొని .. మౌనం గా వెళ్లి పోయాను .
నేను  మౌనం గా వుండడం చూసి అక్క కి అనుమానం  వచ్చి, చిన్నా ! సుప్రియ రాలేదని బాధపడకు రా .. తను సిగ్గు పడుతోందట .. అయ్యో అవునా .. తను వస్తుందేమో  అని చాలా ఆశ పడ్డాను .. అన్నాను .. తనకి అనుమానం వచ్చి బెడ్ రూమ్  లోకి వెళ్లి  వచ్చింది . ఏమయ్యింది అడిగాను . ఏమీ లేదు .. అంది తను .. అక్క ఏమైనా మాట్లాడుతుందేమో  అని చూసినా తనేం మాట్లాడడంలేదు .. సుప్రియా అమ్మ నాన్నా కూడా మాట్లాడడంలేదు .. నేను కాసేపు మౌనం గా కూర్చొని ఏమీ తెలీనట్లు నా బెడ్ రూమ్ కేసి దారితీశాను .. అక్కకి సీన్ అర్థం అయ్యింది ... చిన్నా ఇక్కడ కూర్చో .. అంది . లేదక్కా .. కొంచెం నీరసంగా వుంది  పడుకుంటా అంటూ రూం  లోకి దూరి డోర్ లాక్ చేసేసా .. అప్పుడు చూడాలి అక్క కంగారు .. లోపల సుప్రియ కూడా కంగారు పడిపోతోంది .. నేను సుప్రియ ని కూర్చోపెట్టుకొని సుప్రియా అక్కని ఆట పట్టిద్దామని వచ్చాను .. నీకోసం కాదు .. అన్నాను .. మధురం గా నవ్వింది .. నా గుండె ఒక్కసారి ఆగిపోయింది .. ఆ నవ్వు చూసి ..  ఇంతలో అక్క  తలుపులు దబదబా కొట్టేస్తూ ఒరేయ్ చిన్నా తలుపులు వేస్తావెందుకు రా తియ్యి ముందు అంటూ అరుస్తోంది .. నేను సుప్రియ ని ఒక్కసారి తనివితీరా చూసుకొని నవ్వుతు తలుపులు తెరిచాను .. అక్కా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా సుప్రియా ఏమైనా చేసాడా అంటూ .. ఏం చెయ్యలేదు చాల మంచోడు వీడు అంది . పోన్లెండి  అలా  వెళ్లి రండి అని వాళ్ళమ్మగారు చెప్పారు .. వాళ్ళ డాడీ కూడా సరే అన్నారు .. అక్కా గుడికి   వెళ్లి వస్తాము అని అడిగాను ..  చిన్నా జాగ్రత్త .. ఎవరైనా అడిగితే ఏం చెప్తావు అంది .. నాకు నోట్లోంచి మాట రాలేదు .. నా కాబోయే భార్య అని చెప్పు .. దిష్టి తగులుతుంది జాగ్రత్త గా వెళ్లి రండి .. ఐస్ క్రీం లాంటి వి కొని పెట్టకు అంది .. అక్కా సుప్రియ కి అవి  చాల ఇష్టం కదా అన్నాను .. నువ్వు తన పేరు చెప్పి  ఎక్కువ తినకు సరేనా .. పాకెట్ లో మనీ వుందా అని అడిగింది .. సుప్రియా నవ్వుతూ అలా చూస్తోంది .. సుప్రియా వీడు నాకు ఎప్పుడు చిన్న పిల్లోడేనమ్మా .. అంటూ మరిన్ని జాగ్రతలు చెప్పి పంపింది .. 

Friday, 1 January 2016

                                                         అక్క 

మన స్నేహం పెరిగి పెద్దదయ్యింది .
ఇప్పుడు రెండు నెలల వయసున్న చిన్న మొక్క ..
దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే  అక్కా ...
రెండు నెలలో ఎన్నో మార్పులు .... మరెన్నో చేర్పులు ..
చిన్నూ ,, చిట్టీ ,, పండూ .. ఇవన్నీ నీ పేర్లే ..
అలా అంటున్నప్పుడు నాకు నవ్వొస్తుంది ...
ఒక చిన్న పాపాయి గుర్తొస్తుంది ..
ఆ మొహం లో అమాయకత్వం ..
గలగలా నవ్వే నవ్వు .. అందమైన మొహం ..,
ఆ మాటల్లో చెప్పలేని అనుభూతి ..
కన్నా ! అని పిలుస్తూ ... నవ్విస్తావు .. ఏవేవో ఊసులు చెప్తావు ..
అక్కా !  నా కష్టం ఇది అని చెప్తాను ..
వెంటనే పరిష్కారం చెప్పేస్తావు ..
నువ్వంటే నాకు ఇష్టం ..ఎంత ఇష్టం అంటే నేనంటే నాకెంత
ఇష్టమో అంత ఇష్టం ...
అక్కా ! ఎన్నో సార్లు నీ మీద కోప్పడ్డాను ..
నెమ్మదిగా తిను ..  టైం కి పడుకో అంటూ .. నువ్వు
అక్కవి కదా .. నీ ఆరోగ్యం ఏమౌతుందో .. నాకు
మాట్లాడడానికి అక్క దొరకదేమో అని స్వార్ధం ..
నాకో అబ్బాయి అక్కా అన్నాడు అని నువ్వు  సంతోషంగా
చెప్పిన రోజు మనిద్దరి మధ్య జరిగిన గొడవ తలుచుకొంటే
సిల్లీ  అనిపించలేదూ ! నాకు ఒకే అక్క వుండాలి
 అది నువ్వే వుండాలి .. నీకు ఒకే తమ్ముడు ఉండాలి ..
అది నేనే తప్ప ఇంకొకరు కాకూడదు .. అని పోట్లాడాను ..
 పాపం .. నాకోసం నీ ఆశని చంపేసుకున్నావు ..
కన్నా ! తినురా .. ఆకలి లేదంటే ఎలా నువ్వు తింటే
నేను తింటా .. లేకపోతే లేదు అని మారాం చేస్తావ్ ..
అది నాకు ఇష్టం .. అందుకే తినడానికి మారాం చెయ్యాలనుంటుంది ..
నా కోసం ఎంతో ఆలోచిస్తావ్ .. నీకోసం ఏమీ చెయ్యనివ్వవు
చిన్నూ ! మనం ఎప్పుడు మాట్లాడుకోవద్దమ్మా అని
నేను  చెప్పిన రోజు నీకు గుర్తుందా ??
 ఏ మయ్యింది కన్నా అని అడిగావు .
నువ్వు  నన్ను పట్టించుకోడం మానేసావ్ అంటే ..
 చాలా బాధ పడిపోయావు .. కాని ఇప్పుడో ...
నేనే బిజీ .. కాని కన్నా !  మాట్లాడదాం రా ..
నీకు కుదురుతుందా అని  పర్మిషన్ అడుగుతున్నావ్
కొత్తగా .. ఏం చెయ్యను .. తప్పదు ..కాని నా గుండెలు
పిండేసి నట్లు ఫీల్ అవుతాను ..  భూమి లోకి కూరుకు పోయినట్లు
అమూల్యమైనది .. పోగొట్టుకున్నట్లు ..
అక్కా ! నేనే మారాలి ... నీకోసం కాదు
నా కోసం .. లేకపోతే నన్ను నేనే క్షమించుకోలేను ..
నాకు నువ్వు కావాలి అక్కా !