అక్క
మన స్నేహం పెరిగి పెద్దదయ్యింది .
ఇప్పుడు రెండు నెలల వయసున్న చిన్న మొక్క ..
దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే అక్కా ...
రెండు నెలలో ఎన్నో మార్పులు .... మరెన్నో చేర్పులు ..
చిన్నూ ,, చిట్టీ ,, పండూ .. ఇవన్నీ నీ పేర్లే ..
అలా అంటున్నప్పుడు నాకు నవ్వొస్తుంది ...
ఒక చిన్న పాపాయి గుర్తొస్తుంది ..
ఆ మొహం లో అమాయకత్వం ..
గలగలా నవ్వే నవ్వు .. అందమైన మొహం ..,
ఆ మాటల్లో చెప్పలేని అనుభూతి ..
కన్నా ! అని పిలుస్తూ ... నవ్విస్తావు .. ఏవేవో ఊసులు చెప్తావు ..
అక్కా ! నా కష్టం ఇది అని చెప్తాను ..
వెంటనే పరిష్కారం చెప్పేస్తావు ..
నువ్వంటే నాకు ఇష్టం ..ఎంత ఇష్టం అంటే నేనంటే నాకెంత
ఇష్టమో అంత ఇష్టం ...
అక్కా ! ఎన్నో సార్లు నీ మీద కోప్పడ్డాను ..
నెమ్మదిగా తిను .. టైం కి పడుకో అంటూ .. నువ్వు
అక్కవి కదా .. నీ ఆరోగ్యం ఏమౌతుందో .. నాకు
మాట్లాడడానికి అక్క దొరకదేమో అని స్వార్ధం ..
నాకో అబ్బాయి అక్కా అన్నాడు అని నువ్వు సంతోషంగా
చెప్పిన రోజు మనిద్దరి మధ్య జరిగిన గొడవ తలుచుకొంటే
సిల్లీ అనిపించలేదూ ! నాకు ఒకే అక్క వుండాలి
అది నువ్వే వుండాలి .. నీకు ఒకే తమ్ముడు ఉండాలి ..
అది నేనే తప్ప ఇంకొకరు కాకూడదు .. అని పోట్లాడాను ..
పాపం .. నాకోసం నీ ఆశని చంపేసుకున్నావు ..
కన్నా ! తినురా .. ఆకలి లేదంటే ఎలా నువ్వు తింటే
నేను తింటా .. లేకపోతే లేదు అని మారాం చేస్తావ్ ..
అది నాకు ఇష్టం .. అందుకే తినడానికి మారాం చెయ్యాలనుంటుంది ..
నా కోసం ఎంతో ఆలోచిస్తావ్ .. నీకోసం ఏమీ చెయ్యనివ్వవు
చిన్నూ ! మనం ఎప్పుడు మాట్లాడుకోవద్దమ్మా అని
నేను చెప్పిన రోజు నీకు గుర్తుందా ??
ఏ మయ్యింది కన్నా అని అడిగావు .
నువ్వు నన్ను పట్టించుకోడం మానేసావ్ అంటే ..
చాలా బాధ పడిపోయావు .. కాని ఇప్పుడో ...
నేనే బిజీ .. కాని కన్నా ! మాట్లాడదాం రా ..
నీకు కుదురుతుందా అని పర్మిషన్ అడుగుతున్నావ్
కొత్తగా .. ఏం చెయ్యను .. తప్పదు ..కాని నా గుండెలు
పిండేసి నట్లు ఫీల్ అవుతాను .. భూమి లోకి కూరుకు పోయినట్లు
అమూల్యమైనది .. పోగొట్టుకున్నట్లు ..
అక్కా ! నేనే మారాలి ... నీకోసం కాదు
నా కోసం .. లేకపోతే నన్ను నేనే క్షమించుకోలేను ..
నాకు నువ్వు కావాలి అక్కా !

No comments:
Post a Comment