Saturday, 26 December 2015

                                                             నా డైరీ లో కొన్ని పేజీలు
ఇప్పుడు  అక్క చెప్పిన విషయాలు : చిన్నా ! మేము చాల కస్టపడి సుప్రియ ఇంటికి చేరుకున్నాము . అప్పటికి టైం  సుమారు ఉదయం 9 అవుతుంది . ఇంట్లో సుప్రియ వాళ్ళ నాన్నగారు బయట కూర్చొని కనిపించారు . మేము వెళ్తూనే తనని విష్ చేసాము . సుమారు తనకు 60 సంవత్సరాలు వుంటాయేమో .  మీరెవరు అని అడిగారు .. మొన్న మా తమ్ముడు మీ ఇంటికి వచ్చాడండీ .. బాగ్ ట్రైన్ లో మర్చిపోతే మీరు తెచ్చి ఇచ్చారట కదా అన్నాను . ఓహ్ ! ఆ బాబా ! భలే సరదా అబ్బాయి .. మా సుప్రియ క్లాస్ మేట్ అట . మా నోరు తెరుచుకొని ఉండిపోయాము . ఇంతలో సుప్రియ అమ్మగారు వచ్చారు . మేము ఆవిడని కూడా విష్ చేసాం .  తను మొహం అదోలా పెట్టుకొని లోనికి వెళ్ళిపోయారు .. మేం కొంచెం బాధపడ్డాం .  ఇంతలో అమ్మా సుప్రియా ఇలా రా తల్లీ ! అని పిలిచారు వాళ్ళ నాన్నగారు .. మేము ఆత్రం గా ఎదురు చూస్తున్నాం . ఇంతలో కాలి పట్టీల మువ్వల శబ్దం చేస్తూ వచ్చింది సుప్రియ . మేమిద్దరం నోరు తెరుచుకొని ఉండిపోయాము .. తను ఒక దేవతా మూర్తి లా వుంది మా కంటికి .  స్కై బ్లూ కలర్ చుడిదార్ లో ఉందామె . అమాంతం తనని ముద్దు పెట్టుకోవాలన్నంత ముద్దుగా కనిపించింది .. అబ్బా ! మీ తమ్ముడు ఎందుకు అన్ని మర్చిపోయాడో ఇప్పుడు నాకు అర్థం అయ్యింది అన్నారు మీ బావగారు . తను  మమ్మల్ని చూసి డాడీ అంది .. మీ క్లాసు మేట్ మొన్న వచ్చారు కాదమ్మా వాళ్ళ సిస్టర్  ఇంకా బావగారు .. ఇలా ఏదో పని మీద వచ్చి నిన్ను చూసి పోదామని వచ్చారట అన్నారు. తను మాకు విష్ చేసింది ..
తన వాయిస్ చాల మధురం గా వుంది చిన్నా ! కళ్ళు వర్ణించాలంటే నాకు భాష రాదు రా. వావ్ ! అని ఒక్క ముక్క అనడం తప్ప మాకు ఏమీ రాలేదు నోట్లోంచి . డాడీ నా రూంలో కి తీసుకొని వెళ్లనా ? అడిగింది .. అయ్యో తల్లీ ! తప్పకుండా .. అమ్మకి చెప్పి తినడానికి ఏర్పాటు చెయ్యమ్మా అన్నారు .. సుప్రియ నా  చెయ్యి పట్టుకొని తన రూం కి తీసుకెళ్తుంటే తన పక్కన నడుస్తున్నందుకు నాకు చాల గర్వం కలిగింది .. ముగ్గురం తన రూం లో కూర్చున్నాక తనే అడిగింది .. మీరు ఎందుకు వచ్చారు .. గోపి కి నేను చెప్పాను కదా .. అంది . నా నోట్లోంచి మాట రానే లేదు రా ..
అది కాదమ్మా .. పాపం తను నీకోసం పరితపించి నిద్రాహారాలు మానేసి ఏడుస్తుంటే  చూడలేక వచ్చామమ్మా ! తనకు నేనే ఇన్నాళ్ళు గా తల్లితండ్రి అయి పెంచాను ... కాబట్టే నిన్ను కలుసుకొని ఒక్క మాట చెప్పి పోదామని వచ్చామమ్మా .. అన్నాను నేను పాపం బావగారికి ఏం మాటలాడాలో కూడా తెలియలేదురా ! చూడండీ ! ఏమైనా మాట్లాడండీ అని అడిగాను . ప్రఫుల్లా !~ నేనేం మాట్లాడగలను .. ఈ అమ్మాయిని చూసాక నా నోట్లోంచి మాట రావడం మానేసింది .. ఒక్క మాట చెప్పనా! వీళ్ళు నిజంగా ఒప్పుకుంటే గోపి కంటే లక్కీ ఎవరూ ఉండరు . కానీ తను గోపి లెవెల్ కంటే చాలా ఎక్కువని చెప్పగలను . అబ్బా  అనకండీ ! ఎలాగైనా ఈ అమ్మాయిని మన ఇంటి కి తీసుకెళ్ళాలి అన్నాను రా చిన్నా ! ఇంతలో సుప్రియ వచ్చి కాఫీ టిఫిన్స్ తెచ్చింది .  చూడమ్మా ! కాఫీ వరకు ఓ.కె ., కాని టిఫిన్ వద్దమ్మా అని చెప్పాము . అదేంటండీ మీరు తినకపోతే తినకపోతే అమ్మా నాన్నా  ఫీలౌతారు .. తీస్కోండి పర్వాలేదు .. అంది .
లేదమ్మా! నీతో ఒక  మాట మాట్లాడాలని  వచ్చాము . వింటావా? అడిగాను . సరే ముందు టిఫిన్ తీస్కోండి తర్వాత మాట్లాడుకోవచ్చు . అంది .. టిఫిన్ తినాలని లేదమ్మా టీ త్రాగుతాము అన్నాను .. సరే చెప్పండి .. అంటూ నా  కూర్చుంది సుప్రియ. తను కూర్చున్నాక అడిగాను సుప్రియా ! ఒకమాట చెప్పవూ నిజాయతీగా .. గోపి నీకు నచ్చలేదా .. అని . అయ్యో  అదేమీ లేదండీ .. కాని అమ్మ నాన్న వొప్పుకోరు వాళ్ళని   కాదని నేను నిర్ణయం తీస్కోలేను . వాళ్ళకి నేనొక్కదాన్నే కదా ! అంది . సుప్రియా !  నువ్వు లేకపోతే వాడు చచ్చిపోతాడమ్మ.. నా తమ్ముణ్ణి గురించి నేను గొప్పగా చెప్పకూడదు .. నువ్వు వాణ్ణి చేసుకుంటే వాడంత లక్కీ ఫెలో ఎవరూ వుండరమ్మ . అన్నాను .. సుప్రియా ! అమ్మ నాన్నలతో మాట్లాడనివ్వవూ నన్ను అని అడిగాను .. సరే పిలుస్తాను . కాని నాన్నకి మాత్రం మేమిద్దరం క్లాసు మేట్స్ అని చెప్పాను అమ్మ కూడా అలాగే చెప్పమంది .. ముందు అమ్మని పిలుస్తాను అమ్మ సరే అంటే నాన్నతో మీరు చెప్పవలసింది చెప్పండి .  కాని ఇది జరిగేపని కాదు..కాని వాళ్ళేమన్నా నాకు సంబంధం లేదు నన్ను ఏమి అనుకోవద్దు .. అంది . సరే  వాడి అదృష్టంఎలా ఉంటే అలా జరుగుతుంది .. కాని ఒక్క మాట సుప్రియా ! తానంటే నీకు  ఇష్టం వుందో లేదో చెప్పలేదు అన్నాను . సరే మీరు కూర్చోండి అమ్మని తీస్కోస్తా అంటూ తను వెళ్ళింది . నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నా .. ఒక పదినిముషాలలో సుప్రియ వాళ్ళమ్మ గారితో  వచ్చింది ..
 బాబూ మీరు వీళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ  వుండండి .. అన్నారామె .. బావగారి ని బయటకి తీస్కెళ్ళి వాళ్ళ డాడీ తో  మాట్లాడమని చెప్పి సుప్రియ మళ్లీ వచ్చింది .
తల్లీ ! నువ్వు  కూర్చొని చదువుకో .. . మేమిద్దరం కాసేపు మాట్లాడుకుంటాం .. డాడీ అడిగితే ఇక్కడకు రావద్దని చెప్పు అన్నారు . మేటర్  సీరియస్ అని నాకు అర్థం అయ్యింది . ఎలాగైనా ఈమెను ఒప్పిస్తే పని ఐపోతుందని నాకు నమ్మకం  వచ్చేసింది .. సరే చెప్పండి అంటూ ఆవిడా కూర్చున్నారు ఒక చైర్ లో .. నా పేరు ప్రఫుల్ల అండీ . మొన్న మీ ఇంటికి వచ్చిన గోపి నా  తమ్ముడు ..  అన్నాను .. అవును మీరు వచ్చినప్పుడే అర్థం అయ్యింది ఎందుకు  వచ్చారో .. సూటిగా  సబ్జెక్టు లోకి వచ్చేసారు .. సరే మా తమ్ముడు మీ సుప్రియ ని చూసి చాల ఇష్టపడ్డాడు . తన వెంట పడి ట్రైన్ కూడా దిగేసి సుప్రియ వెంట పడ్డాడట .. ఇంటికి వచ్చి సుప్రియ లేకపోతే చచ్చిపోతా అని ఒకటే ఏడుపు . మాకు అమ్మ, నాన్నా   ఎవరూ లేరండీ .. వాడికి నేనే అన్ని .. అందుకే వచ్చాను .. అన్నాను ..సరే ఇప్పుడు మమ్మల్ని చెయ్యమంటారో   చెప్పండి .. అన్నారు . అదేనండి మీరు కొంచెం పెద్దమనసు చేసుకొని వాణ్ణి ఆశీర్వదిస్తారని ...... చూడండి మీరు చెప్పింది నాకు అర్థం అయ్యింది .. మనం ఎలా చుట్టరికం కలుపుకోగలం .. మీరు బ్రాహ్మిన్స్ మేము రెడ్డి .. సమాజం ఒప్పుకోదు ... చదువుకున్నారు .. మీకు తెలీదా ? ఇంకా మీరెవరో మేమెవరో కూడా తెలీదు .. పోనీ దాన్ని సరే అనుకుందాం మీ తమ్ముడు   సుప్రియ కంటే ఏజ్ లో చిన్నవాడు .. అంతే కాదు తను కాలేజీ లో లెక్చరర్ ... మీ తమ్ముడు టీచర్ .. రేపుదయం ఏమైనా జరిగినా అందరం బాధపడాలి .. నా మాట వినండి .. మీ కంటే వయసులో పెద్దదాన్ని ఎందుకు చెప్పానో అర్ధం చేసుకోండి ... మీ తమ్ముడుకి చెప్పండి .. సుప్రియ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని  జరగదని చెప్పండి సరేనా .. ఎలాగూ వచ్చారు కాబట్టి కాసేపు సరదాగా మనం మాట్లాడుకుందాం . ఈ విషయం ఇక్కడితో వదిలెయ్యడం మంచిది అన్నారు .
మా తమ్ముడు టీచరా ?? వ్హాట్? మీకెవరు చెప్పారు . వాడె చెప్పాడా?నాకు తెలుసు వాడు ఇలాంటి  తిక్క పనులు చేస్తాడని .. హహహహః వాడు టీచర్ కాదండీ .. వాడు ఈ మధ్య ఐఏఎస్ కి  సెలెక్ట్ అయ్యాడు ..  టాప్ ర్యాంక్ లో వచ్చాడు . .అన్నాను .. నోరు తెరుచుకొని ఉండిపోవడం ఆమె వంతు అయ్యింది ఇప్పుడు ..అవునా?
మరి తను అలా చెప్పాడు .... అన్నారు . వాడు అంతేలెండి . తానో ఐఏఎస్ అంటే  చేస్తారు చెప్పండి .. అందుకే  వాడె ప్పుడు అలా చెప్పడు . అన్నాను . చూడండీ ! తనుపెద్ద ఆఫీసర్ అయినా   కాకపోయినా సుప్రియ ని  పెళ్లి  చేసుకోవడం జరగని పని ... ఈ విషయం సుప్రియకి  అన్నారు .. ఏమండీ ఇంకోసారి కొంచెం ఆలోచించండి ..  తమ్ముడు సుప్రియ ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు . పోనీ సుప్రియ మనసులో ఏముందో చెప్పండి . నాకు కాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదు ..  లెక్కకాదు .. మీరోసారి సుప్రియ ఒపీనియన్ అడిగితే  వెళ్ళిపోతాను ... మిమల్ని బాధపెట్టను .  అదేమని చెప్పగలదు చిన్నపిల్ల ... అన్నారు .సరే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బాధపెడుతున్నాను సారీ అండీ .. సరే  మేము వెళ్ళొస్తామండీ .. లేచాను అక్కడ ఉండాలనిపించలేదు . మనసులో చాల బాధగా వుంది . ఏడుపు వచ్చేలా ఉంది . ఇంతలో సుప్రియ వచ్చింది . సరే నమ్మా సుప్రియ మేము వెళ్తున్నాం .. బహుశా మిమ్మల్ని బాధపెట్టి ఉంటాము క్షమించండి అన్నాను .సుప్రియ  కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి .. నేను  మాట్లాడలేదు .. బయటకి  వచ్చేసాను .. హాల్లో .. బావగారు ఏమైయ్యింది  అడిగారు .. పదండి వెళ్దాం అన్నాను .. తనకి  విషయం అర్థం అయ్యింది ..  వెళ్ళొస్తామండీ  అని వాళ్ళ నాన్న గారికి ఒక నమస్కారం పెట్టి బయటకి వచ్చేస్తున్నాం .. సుప్రియ ...  డాడీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు .. ఆపవా ?? నాకోసం ... అంటూ బావురుమని యేడిచేసింది.. ఏమయ్యింది రా తల్లీ ... ఎందుకు ఏడుస్తున్నావు .. కంగారుగా అడిగారాయన ..
సుప్రియా వాళ్ళమ్మగారు ఊహించలేదు .. తను ఇలా ఏడుస్తుందని .. మీరు వెళ్ళకండి .. ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతోంది సుప్రియ . మేము మౌనంగా నిల్చున్నాం .. డాడీ  వచ్చిన గోపి నా క్లాసు మేట్ కాదు .. నీకు అబద్ధం చెప్పాను .. క్షమించు నాన్నా ! అంటూ తన కాళ్ళు పట్టుకుంది .. ఏంటి తల్లీ ! ఏమయ్యింది ఇప్పుడు .. అడిగారాయన .. డాడీ నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు .. ఇప్పుడు అడుగుతున్నాను ... నాకు గోపి కావాలి డాడీ .. తను వెళ్ళినప్పటి నుండి నా మనసు నా మాట వినడం లేదు డాడీ ! ఏడుస్తోంది తను.
సుప్రియా వాళ్ళమ్మ నాన్నా కూర్చోమని చెప్పారు మమ్మల్ని .. నేను విషయం మళ్లీ చెప్పాను ఆయనకీ ... మేము డబ్బు విషయం లో కాని ప్రేమ విషయం లో కాని సుప్రియ కి ఏలోటు లేకుండా చూస్కోగలం .. తను నాన్ వెజ్ తిన్నా మాకేం ప్రాబ్లం లేదు .. బయట తిని వచ్చేస్తే చాలు ... మా తమ్ముడు సంతోషం  మాకు కావాలి .. మేము మంచి న్యూస్ తో తన ముందుకు వెళ్ళకపోతే తన గుండె ఆగిపోతుందని చెప్పాడు సర్ .. ఇంతకంటే మేము ఎక్కువ చెప్పలేము .. మీరు మా వూరు రండి .. మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవచ్చు .. అంటూ ఒక నమస్కారం పెట్టి లేచాము . చూడండమ్మా మీకు మాకు చాల తేడాలు ఉన్నాయి .మీరు చెప్పింది సరే అనుకుంటే మాకు అంత డబ్బు లేదు .. కాని మా అమ్మాయి అంటే మాకు ప్రాణం .. తను  సరదా పడిందని  జాబు కి పంపుతున్నాం .. కాని తను వెళ్ళడం మాకు ఇష్టం లేదు .. ఏదో ఒకరోజు మా  అమ్మాయికి పెళ్లి చెయ్యాలని తెలుసు .. మేము రోజు భయపడుతున్నాం తను దూరమైతే మేము బ్రతకలేమమ్మా .. ఇంకా కులం డబ్బు ఇవన్నీ మాకు అడ్డు కాదమ్మా .. మాది లవ్ మ్యారేజ్ .. మాకు తెలుసు మిమ్మల్ని బాధ పెడుతున్నామని .. మీరు వస్తారని మేము ముందే ఊహించాము .. పిల్లల సంతోషాన్ని కాదనే చెడ్డవాళ్ళం కాదు మేము ... అన్నారు .. సరే మేము కొంచెం ఆలోచించుకోడానికి టైం ఇవ్వండి ... అన్నారు .... సరే మీ ఇష్టం ... మేము బయలు దేరుతామండీ .. మా  నుండి మా తమ్ముడు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వమన్నాడు .. ప్లీజ్ ఒప్పుకొండీ .. అన్నాను . సుప్రియ మొహం లో నవ్వు కనిపిస్తోంది . తనను దగ్గరకు తీస్కొని నుదిటి మీద ముద్దు పెట్టుకొని బాగ్ లోంచి చైన్ తీసి మేడలో వేసాను .. ఇవన్ని ఇప్పుడెందుకు తర్వాత చూద్దాం అన్నారు వాళ్ళ నాన్నగారు .. పర్వాలేదండి .. మా ఇంట్లో తను తిరుగుతుంటే మాకు చాల సంతోషం గా ఉంటుందని .. గుర్తు చెయ్యడానికి ఇచ్చాను ఏమీ అనుకోకండి .. రేపు సండే మంచి రోజు సుప్రియ ని కూడా తీసుకొని మీరు మా ఇంటికి రండి .. మీకు మా ఫ్యామిలి గురించి నచ్చితేనే మనం మాట్లాడుకుందాం .. లేదంటే మిమ్మల్ని బాధపెట్టం .. సెలవు మరి అన్నాను .. అబ్బా ఇప్పుడు మీకు ట్రైన్స్ ఉండవ్ కదా ..  కాసేపు రెస్ట్ తీస్కొండీ .. మా కాలేజీ మీకు చూపిస్తాను   .అంది సుప్రియ .  సుప్రియా ! .. సరే కాని భోజనం మాత్రం ఇక్కడ చెయ్యం .. మా సెంటిమెంట్స్ మాకుంటాయి కదా .. బయట తినేస్తాం సరేనా అన్నాను .. సరే అని తను అయిష్టంగా ఒప్పుకొంది ..
మేము స్నానం చేసికొని దగ్గరలో టెంపుల్ కి వెళ్ళాము .. సుప్రియే మమ్మల్ని తీసుకెళ్ళింది .. తను చాలా చలాకీగా వుంది .. దారిలో నేనే అడిగాను .. గోపీ నీకెందుకు  నచ్చాడని .. తను సిగ్గుపడిపోయింది .. గుడిలో కూర్చున్నాక చెప్పింది తను స్టేషన్ లో  ఐ లవ్ యు అని చెప్తే గుండె ఆగిపోయిందట .. తను నీ అంత అందంగా వుండడు కదా అని అడిగాను .. వాడి మనసు మంచిదని గ్రహించాను ..అంది .. సుప్రియా ! వాడు వీడు అనకు .. తానో పెద్ద ఆఫీసర్ కాబోతున్నాడు కదా అన్నాను .. అబ్బా నాకు అలా పిలవడం   ఇష్టం .తను నా  చిన్నవాడు కదా  ఏజ్ లో  అంది తను.. నేనేమి అనలేదు ..సుప్రియ ని చూస్తే ఏమీ అనాలనిపించలేదు .. ఇద్దరం మౌనంగా కొంతసేపు కూర్చున్నాం .. తనే అంది మళ్లీ ..  గోపీ వెళ్ళిపోయాక నాకేం తోచలేదు .. ఎందుకో నాకు  నచ్చేసాడు .. కాని  అమ్మా నాన్నా   ఒప్పుకోరని నాకు తెలుసు .. ఇవ్వాళ  మీరు బయలు దేరుతుంటే నాకు భయం  వేసింది .. ఇంకేప్పటికి మేము కలుసుకోలేమేమో  అని . .. అందుకే  నాన్న ముందు ఏడ్చేసాను .. నాన్నకి నేనంటే  ఇష్టం కదా ...అందుకే మాట్లాడుతూ  సైడ్ నుండి ఒ.కే ., అనేసారు .. అమ్మకి కూడా గోపీ అంటే ఇష్టమే .. కాని  బయట పడలేదు .చిన్నా ! తను కాలేజీ లో మంచి పేరున్న లెక్చరర్ ..  వాళ్ళ స్టాఫ్ కూడా సుప్రియ ని చాల మెచ్చుకుంటున్నారు .. అదీ సుప్రియ విషయం ..  అంది అక్క ..
అక్క చెప్పిన విషయాలు విన్నాక  నాకు చాల సంతోషం కలిగింది .  అక్కా ఐ లవ్ యూ .. చెప్పేసా ..

Thursday, 10 December 2015

                                                                     కమల 
కమల ... నా జీవితానికి వెలుగు తెచ్చిన దేవదూత .. 
కష్టాల్లో ... నా వెంట ఉండి .. నడిపించిన దేవత .... 
ఏమిచ్చి  నీ ఋణం తీర్చుకోగలను కమలా !
సేవ చెయ్యడానికి వచ్చావు .. అమ్మ కన్నా అక్క కన్నా ...... 
ఫ్రెండ్ కన్నా ..... బంధువు కన్నా ఎక్కువ సేవ చేసావు .. 
నేనో అనాధననే ఫీలింగ్ లేకుండా చూసుకున్నావు .. 
కమలా .... అమ్మవయ్యవు ... అక్కవి కూడా అనిపించుకున్నావు 
అవసరమైతే కాదనకుండా రక్తాన్ని పంచావు ... 
నాకు ఊపిరినిచ్చావు .... జీవితం మీద ఆసక్తిని కలిగించావు . .... 
నాకున్న నాకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాను ... 
కాని ఇవ్వడమే తెలుసు నీకు ... 
ఎందుకు నా మీద ఇంత ప్రేమ నీకు

జాలి అనుకోనా ... కాదు ప్రేమే ... కాని కమలా !
ఇంత ప్రేమ ని తట్టుకోలేనేమో .... 
 రోజూ ఉదయం  లేచే సరికి చిరు నవ్వుతో .. గుడ్ మార్నింగ్ సర్ ., 
కాని కాసేపట్లోనే ఏడిపిస్తావు ఇంజక్షన్ తో వచ్చి
కమలా నాకు భయమమ్మా .. ఇంజక్షన్ అంటే అని చెప్తానా ... 
ఉండు నేనున్నాగా అంటూ నవ్వుతూనే ఇంజక్షన్ ఇచ్చేసి ... 
 తుర్రుమంటావు ...
అక్క నిన్ను నాకు గిఫ్ట్ గా ఇచ్చిన రోజు నాకు బాగా గుర్తు .... 
నేను అక్కకో మాట చెప్తే నువ్వు నీమాటలతో తనని ఒప్పించేసావు ... 
ఈసారికి ఇలా కానిచ్చేయ్యిరా కన్నా అని అక్క చెప్తే .. మౌనం గా 
తలూపేసి ... సరే అన్నాను .   నాకు నీ మీద ప్రేమని ఎలా చెప్పాలో 
తెలియలేదు ... కాని నా ప్రేమని  నువ్వే గెలిపించావేమో .... 
కమలా ! కొంచెం రోజుల పరిచయం ... కానీ జన్మ జన్మల బంధం ... 
అదే సృష్టి విచిత్రం ..... సేవ చేసి నన్ను మనిషిని చేస్తావనుకున్నాను .... 
ప్రేమతో నాలోని మనిషిని బ్రతికించావు .. ఏమిచ్చి నీ ఋణం .. 
తీర్చుకోగలను .... ఎప్పటికి ... ఇంకెప్పటికి ... నీ జీవిత భాగస్వామిగా .. 
ఉంటూ ... నీ చల్లని నీడలో సేదదీరుతా ... 





Tuesday, 8 December 2015

                                                              నా డైరీ లో కొన్ని పేజీలు

రాత్రంతా ఇద్దరం మాట్లాడుతూనే ఉన్నాం . కానీ వాళ్ళమ్మగారు మమ్మల్ని  ఏమీ అనలేదు . నాకు చాల ఆశ్చర్యం కలిగింది . అదే విషయం అడిగాను తనని . తను చిన్నగా నవ్వేసి చెప్పింది . ఇంట్లో తను ఏం చెప్తే అదే చేస్తారట . తను అంటే వాళ్ళమ్మా నాన్నలకి ప్రాణమట . అప్పుడు కొంచెం  నోరు తెరిచాను . "సుప్రియా ! నిన్ను ఎందుకు చూసానో తెలీదు . నాకు నువ్వు కావాలి . ప్లీజ్ కాదని అనకు" అన్నాను . "అబ్బా ! అదే ఎందుకు చెప్పు" అంది తను . "నేను చెప్పలేను . కాని నా మనసులో మాట నీకు చెప్పేసాను", అని అన్నాను . "నేను నీకంటే ఏజ్ లో పెద్దదాన్ని . మన ఇద్దరి కాస్ట్ ఒక్కటి కాదు . గోపీ ! నా  మీద అంత ఆశ పెట్టుకోకు"  అంది . "సుప్రియా ! నాది ప్రేమే తప్ప నీ మీద కోరిక కాదు సుప్రియా ! సరే నీ ఇష్టం . కానీ ఏదో ఒక్క రోజు నా ప్రేమని నువ్వు ఫీల్ అవుతావు" అని చెప్పి నేను గుడ్ నైట్ చెప్పి  పడుకున్నా . నాకు తెలుసు తను ఎట్టి పరిస్థితిలోనూ నాదే అని . నా మనసులో చిన్నగా నవ్వు . దుప్పటి ముఖం పైకి లాక్కున్నా . సుప్రియ ఒక్కక్షణం అలా చూస్తుందని నాకు తెలుసు . తర్వాత తను ఏం చేస్తుందో తెలుసు . 
ఒక్క క్షణం ... ఇంకో క్షణం ... సుమారు ఐదు నిముషాలు . ... నాకు చిన్న అనుమానం .... నా టైమింగ్ మీద నాకు మొదటిసారి అనుమానం . సరిగ్గా అప్పుడే తను నా ముఖం మీది దుప్పటి లాగింది . "నువ్వలా చెప్పేసి పడుకుంటే .... నాకెలా  నిద్ర పడుతుంది . మా ఇంటికి వచ్చావు . నన్నే డౌట్ లో పడేసావు . నువ్వు మాట్లాడకపోతే ఎలా"? అంది . "ఏం మాట్లాడాలి"?  అడిగాను . "గోపీ ! వద్దురా .. కావాలంటే మనం ఫ్రెండ్స్ గా   ఉందాం" ... తనే చెప్పింది ."అయినా నువ్వెవరో నేనెవరో తెలీకుండా ఇదంతా ఏమిటి అసలు .. నువ్వంటే నాకు ఇష్టం లేదు .... నేను ఇప్పటికే పెళ్లి చేసుకున్నాను . మా అయన ముంబై లో బిజినెస్ చేస్తున్నారు" ... అంది . "హహహ అవునా! సరే ఐతే పడుకో తనని తలుచుకొంటూ" . అని మళ్ళీ దుప్పటి ముఖం మీదికి లాక్కున్నాను . "హేయ్ ! నీకేమైనా మతి  పోయిందా .  నాకు పెళ్ళి అయ్యిందిరా.  చెప్తే వినవా" ? అంటూ మళ్ళీ ముసుగు లాగింది .  "తన  పేరు పేరు రంజిత్ . ముంబై లో  బిజినెస్ చేస్తున్నారు" . అంది . "సరే ! పడుకో",  చెప్పాను . 
తనకి  ఏం చెప్పాలో అర్థం కాలేదని  తెలుసు .  కొంచెం సేపు అక్కడేకూర్చొని  లేచింది . వెళ్తూ వెళ్తూ నా వైపు చూసి లైట్  ఆఫ్ చేసింది . చేసి మల్లి తిన్నగా   వచ్చి సోఫా దగ్గర  నిలబడి  నా నెత్తి మీద ఒక్కటి మొట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది . మర్నాడు సరిగా మధ్యానం టైం కి  సుప్రియా వాళ్ళ నాన్నగారు వచ్చేసారు . నా బాగ్ కోసం నేను ఆత్రంగా చూస్తున్నానని తెలుసుకొని నవ్వుకున్నారు . సుప్రియే మా ఇద్దరికీ పరిచయాలు చేసింది . నాకు ఒక విషయం అర్థం కాలేదు . తను నన్ను క్లాస్ మేట్  గా పరిచయం చేసింది .  వాళ్ళ అమ్మగారు కూడా తలఊపుతూ .. బాబు చాల మంచివాడు లాగా   ఉన్నాడండీ .. అంటూ చెప్పారు . ఈ సడన్ ట్విస్ట్ నాకు అర్థం కాలేదు . బుర్ర గోక్కున్నాను . "రేపు వెళ్ళొచ్చు లే బాబూ" .. అన్నారు తను . "లేదు సర్ .. పనులున్నాయండి" .అంటూ   బయలుదేరాను . "సుప్రియ గారు వెళ్ళొస్తానండీ ..  మీ రంజిత్ గారిని అడిగానని చెప్పండి", అన్నాను వత్తి   పలుకుతూ . .... సుప్రియ వాళ్ళ నాన్న వెనక్కి చేరి దండం పెడుతూ "వెళ్ళరా బాబూ" అంటోంది . నేను చిరునవ్వుతో . . . . "మీ అల్లుడుగారు ఎప్పుడొస్తారు? సర్" అన్నాను . తను ఒక చేత్తో నెత్తికొట్టుకుంటూ  వేగంగా అక్కడినుండి లోపలి పరిగెత్తింది . మా అమ్మాయికి పెళ్లి కాలేదు బాబూ ... అయోమయంగా చెప్పారు వాళ్లనాన్నగారు .  "మీ అల్లుడుగారి పేరు కూడా రంజిత్ అని తనే చెప్పారండీ" .. అమాయకం గా చెప్పాను . తనేమో దండం పెడుతోంది  మాట్లాడవద్దని . "అవునా ... తల్లీ  ఇలా రా" .. పిలిచారు . తను పిల్లిలా అడుగులో  అడుగేసుకుంటూ వచ్చింది . "నాకు చెప్పకుండా ఇంత పని చేస్తావా? పోనీ రంజిత్ ని రమ్మని  పిలుద్దామా" ? అడిగారు .తన  చెవిని పట్టుకొని  మెలిపెట్టారు . తనేమో  నా వైపు కోపంగా చూస్తూ నవ్వుతోంది . "సరే బాబూ నువ్వెళ్ళి రా" అన్నారు . అయిష్టంగానే బయలుదేరాను . నాన్నా "నేను తనని ట్రైన్ వరకు వెళ్లి సెండ్ ఆఫ్ ఇచ్చి రావద్దా . అంది ... సరే వెళ్లి  జాగ్రత్తగా వచ్చెయ్యి  తల్లీ .. అన్నారు .  కొంచెం దూరం వెళ్ళాక అడిగాను డాడి తో అల చెప్పావేం అని . తను ఒక్క నవ్వు నవ్వి ఊరుకుంది . సుప్రియా ! ఐ లవ్ యు ..మళ్ళీ చెప్పాను . తను మౌనంగా నా వేపు చూసింది . తన చూపులో బాధ ఉంది . సుప్రియా అక్క ని పంపనా ?  అడిగాను .  తనేం చెప్పలేదు . అడ్రస్ ఇస్తావా  నీది .. అడిగాను . సరే అని తను చెప్పింది . 
 అడ్రస్  నోట్   చేసుకున్నాను . సుప్రియా!  అక్క వివరాలు చెప్తుంది . వెళ్ళొస్తా అన్నాను .  గోపీ! అంటూ   చెయ్యి ముందుకు చాపింది . షేక్ హ్యాండ్ కోసం . నేను తన    చెయ్యిని ఒకసారి  నొక్కి వదిలాను .సుప్రియా ! నేను వెళ్ళొస్తా ! అంటూ ముందుకు కదిలాను . గోపీ ! ఒక్కపూట పరిచయం రా మనది . అది మర్చిపోకు అంది .సుప్రియా ! అక్క వస్తుందిరా  మాట్లాడుతుంది . అప్పడైనా నీ ఒపీనియన్  చెప్పవా అడిగాను .సరే  .. చూద్దాం .అంది  తను . 
నేను జర్నీ ముందుకు సాగనివ్వకుండా తీరిగి ఇంటికి చేరుకున్నాను . అక్క ఎప్పటిలా ప్రయాణం విశేషాలు అడిగింది . నేను ముందుకు ప్రయాణం చెయ్యలేదని చెప్పి సుప్రియ విషయం తనకు చెప్పాను. ప్రయాణం అర్థంతరం గా ఆగిపోయినందుకు అక్క కి కోపం రాలేదు కానీ , చిన్నా నువ్వు వెళ్ళిన పనేంటి , చేసిన పనేంటి , అంటూ కోప్పడింది . నాకు తెలుసు అక్క కోపం తాత్కాలికం అని.  మాట్లాడకుండా అక్క ఒళ్లో తల పెట్టుకొని అక్క ముఖంలోకి చూస్తూ అక్కా నాకు సుప్రియని తెచ్చి ఇవ్వవా ? తను కావాలి నాకు అంటూ ఉంటే ... ఛ .. అలా అనకురా నాకు మాత్రం తమ్ముడు వద్దా ... సరే చూద్దాంలే . అంది . అక్క సరే అంటే ఆ పని ఐపోతుందని నాకు తెలుసు . బావగారు కూడా అక్క మాట కి కాదనరని నాకు తెలుసు.  చిన్నా ! వెళ్ళి రెస్టు తీసుకో .. నేను  వంట చేసి పిలుస్తాను . సరే నా అంది . అక్క చాల తీవ్రం గా ఆలోచిస్తోందని నాకు తెలుసు. మౌనంగా  లేచి బయటకి వెళ్తుంటే తనే పిలిచింది .. బయటకి వెళ్ళకు మాట్లాడే పని వుంది అని. కొంచెంసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నాను . ఇంతలో తను వచ్చి నా ముందు చైర్లో కూర్చొని .. చెప్పరా విషయం అంది . నేను ఒక్క విషయం కూడా వదలకుండా అన్ని చెప్పేసా ..ఐతే ఆ అమ్మాయి బ్రాహ్మిన్ కాదు . మరి నువ్వు చేసుకుంటే మన పరువు ఏమౌతుందో తెలుస్తోందా ... నువ్వు చదువుకున్నావు .. కాని మన చుట్టూ సొసైటీ వుంది నాన్నా ! ఆలోచించావా ? అడిగింది కూల్ గా . 
నేనేం మాటలాడలేదు . ఇంతలో బావగారు వచ్చేసారు . అక్క తమ్ముళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారా ? అంటూ .బావ గారూ ! బావున్నారా? అడిగాను  ఎప్పుడొచ్చారు . అడిగారు బావగారు .  వీడేం ఘనకార్యం చక్కపెట్టుకొచ్చాడో అడగండి . అంది అక్క ... నేను మౌనంగా వున్నాను .. ఏమయ్యింది అడిగారు బావగారు . అక్క పగలబడి నవ్వుతోంది . వీడో ప్రేమ పిచ్చోడు .. హహహహహ్ ..... అక్కడ వరంగల్ స్టేషన్ లో ఒకమ్మాయిని చూసాడట . బాగ్ కూడా మర్చిపోయి దిగేసి తన వెంట పడ్డాడట ..... ఇదిగో ఇప్పుడొచ్చి నాకేం తెలీదు అమ్మాయిని నాకు  తెచ్చి ఇవ్వు అంటూ ఇదిగో గొడవ .. భోజనం తిను అంటే వద్దట .. స్నానం లేదు .. ఒకటే సతాయింపు .. అబ్బా! చెప్పండి మీరైనా ! అంది అక్క . అవునా ... ఇంకేం మనకి శ్రమ కదా ..... హహహహహ చూడు మీ తమ్ముడు ఎంత తెలివైన  చేసాడో ! నవ్వుతున్నారు బావగారు. నాకు అక్క  మీద చాల కోపం వచ్చింది . సరే అక్కా నా పరువు తీసేసావు ... నేను వెళ్తున్నా ..... అన్నాను ..  అక్క బావగారు బ్రతిమలాడుతారని .... సరే  రా ఐతే ,  వెళ్లి రా నాకూ  పనిఉంది . నువ్వు బయలు దేరితే తలుపు వేసుకోవాలి . వంట గదిలోంచే  అక్క సమాధానం విని నా  నోరు మూతపడింది . మౌనంగా బాగ్ తీసుకున్నాను .. సరే బావగారు  వెళ్ళొస్తా ... అంటూ బయటకి వచ్చాను .  ఎక్కడికి వెళ్ళను .. ఆలోచిస్తున్నాను .. ఒరేయ్ తమ్ముడూ ! సరదాగా అంటే నిజంగా వెళ్తావా .. వెధవా ! .. రా లోపలకి అంటూ తీసుకొని వెళ్ళింది .. సరే అమ్మాయి మన కులం కాదు మరి మనవాళ్ళు అడిగితే ఎలా చెప్పాలి .. ఏమండీ మాట్లాడరేం అంది బావగారితో .. సరే ఇప్పుడేం  చేద్దాం .. అన్నారు బావగారు . 
అక్కా ప్లీజ్ నా మాట వినవా  నాకు తను కావాలక్కా ... నువ్వేం చేస్తావో తెలీదు తనని ఎలాగైనా తీసుకొని రా అక్కా !  బ్రతిమలాడుతుంటే ... అబ్బా ఉండరా  ఆలోచించుకోనీ .. అంది . సరే ఇవ్వాళ వద్దులే .. రేపు ఉదయాన్నే ట్రైన్ ఎక్కేసి వెళ్ళండి  మళ్లీ తనని తీస్కొని వెంటనే సాయంత్రానికి వచ్చెయ్యండి అన్నాను.. ఏంట్రా ! ఇవ్వాళ వద్దా.. రేపు ఉదయాన్నే వెళ్లి తనని తీస్కొని వెంటనే వచ్చేయాలా .. అబ్బా మాకు మంచి ఛాన్స్ ఇచ్చావు కదరా.. తను అమ్మాయి  అనుకుంటున్నావా లేక బొమ్మ అనుకుంటున్నావా. .... నవ్వుతోంది అక్క .. 
అక్కా ! ఎలాగైనా  నాకు ఆ అమ్మాయిని తెచ్చి ఇవ్వవా .. తను లేకపోతే నా గుండెల్లో చాలా నొప్పిగా వుందక్కా .. తను నాకోసమే పుట్టిందక్కా .... చిన్నా ! ఊరుకోరా .. నువ్వు ఏడిస్తే నాకేం చెయ్యాలో తెలీడం లేదురా ..... నేను నీ మాట కాదని ఎప్పుడైనా అన్నానా ..  కొంచెం ఆలోచించుకోనివ్వు నాన్నా ..! అక్కా  లేట్ అయిపోతే తనకి పెళ్లి అయిపోతుందక్కా ... అబ్బా ... నువ్వు కొంచెం ఉంటావా మేమిద్దరం ఆలోచిస్తున్నాం కదా ! నువ్వెళ్ళి పనులుంటే చేస్కో .. అంటూ బావగారు కూడా అనేసరికి ఏం చెప్పాలో తెలియలేదు నాకు .  మౌనం గా బయటకి నడిచాను .. అయ్యో పాపం వాణ్ణి అలా ఎందుకు అన్నారు .. ఎంత బాధపడుతున్నాడో ! కొన్ని రోజులైతే తను ఎలాగూ ట్రైనింగ్ కి వెళ్ళిపోతాడు కదా ..  అని అక్క అనడం నాకు వినిపించింది . అదేంటి ప్రఫుల్లా ! అలా అంటావ్ తను నీకు తమ్ముడైతే నాకు ఇంకా ఎక్కువ .. నా బావ మరిది ఐఏఎస్ అని చెప్పుకోడం నాకు   మాత్రం  గర్వం కాదా ? అన్నారు ..   సరే .. ఇప్పుడు ఏం చేద్దాం .. అడిగారు బావగారు .. రేపు ఉదయం వెళదాం .. ఏదో ఒకటి మాట్లాడకపోతే వాడికి సంతోషం గా వుండదు కదా ! అంది అక్క. సరే ఐతే తనకి చెప్పు అన్నారు . అవసరం లేదు అంది అక్క .మర్నాడు ఉదయాన్నే ఇద్దరూ బయలు దేరారు .. నాకైతే మనసులో చాల హ్యాపీ గా వుంది . అక్క  వెళ్తే నా పని ఐపోతుందని నాకు నమ్మకం ఉంది . కాని కొంచెం దిగులుగా వుంది .. "సుప్రియా ! నా ప్రేమని కాదనకు" .. అని మనసులో అనుకున్నాను కనీసం వెయ్యిసార్లు ..
                                                                                         

Wednesday, 2 December 2015

                                                           నా డైరీ లో  కొన్ని పేజీలు

బహుశా  ఈ పేజీ నేను తెరిచి పెడతానని మా అక్క ఊహించి ఉండదు . మా అక్కకి ఇష్టం లేని పేజీ ఇదే అని నా నమ్మకం .
              "అది 2013 వ సం . మార్చి నెల 22 వ తారీఖు. నేను విశాఖపట్నం  నుండి సికింద్రాబాద్ వెళ్ళే  ట్రైన్లో    ప్రయాణం     చేస్తున్నా.  వరంగల్ స్టేషన్ కి చేరుకోనేసరికి టైం సాయంత్రం నాలుగు దాటింది . ఎందుకో నా ద్రుష్టి ప్లాట్ ఫాం మీదికి మళ్ళింది . ఒక్కసారి అదిరిపడ్డాను .. కారణం ఒక అందాలరాశి నాకు ప్రత్యక్షం కావడమే . నేను ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా ట్రైన్ దిగేశాను . పరిగెత్తుకుంటూ వెళ్లి తనముందు నిలబడ్డాను . ఆయాసం తో రొప్పుతూ తన ముందు నిలబడ్డాను .  తను చిరునవ్వుతో నా వైపు చూసింది .. కళ్ళెగరేస్తూ.  ఏం కావాలన్నట్లు .  ఆ కళ్ళల్లో ఆకర్షణ శక్తీ వర్ణించలేనిది .
ఐ లవ్ యు అన్నాను . తను ఆశ్చర్యపడి వ్హాట్? అంటూ లేచి నిలబడింది . గబగబా  లేచి అక్కడినుండి విసురుగా వెళ్ళిపోయింది .   నేను ఒక్కక్షణం కూడా వృధా చెయ్యకుండా తనని అనుసరిస్తూ నడవసాగాను .  చివరికి తనో  ఇంట్లో కి దూరింది .
నేను తనని ఫాలో అవుతున్నాను .. తిన్నగా తను వెళ్ళిన ఇంట్లోకి వెళ్లి గుమ్మం దగ్గర ఆగిపోయాను . ఇంతలో ఒక పెద్దావిడ వచ్చి ఏయ్ ఎవరు నువ్వు అంటూ అడిగారు .  తెలిసినంతవరకూ తను ఈ అమ్మాయి కి అమ్మ కావచ్చు . ఏం లేదండి .  ఇప్పుడొక ఆమె వచ్చారు కదా వారిని ఒక్కసారి చూసి వెళ్లాలని  వచ్చాను . అని చెప్పాను .
ఎవరు నువ్వు అసలు ఎందుకు వచ్చావు అడిగారు ఆమె . నేను చాల దూరం నుండి వస్తూ  ఆమెను చూసానండి అన్నాను .   ఐతే ఇప్పుడేమంటావ్ అడిగారు ఒక్కసారి తనని చూసి వెళ్తా ప్లీజ్ అన్నాను . నీకేమైన మతి పోయిందా అడిగారు ఆమె . నాకు నోట్లో మాట కూడా రావడం లేదు .
బాబూ  మేము చాలా సంతోషం గా బతుకుతున్నాం . మమ్మల్ని ఇలా వుండనివ్వవు . అయినా నీకేం అపకారం చేసాం మేము . ఇలా వెంటపడ్డం ఏమైనా బాగుందా?అన్నారు .. ఏమండీ! తనని ఒక్కసారి చూడనివ్వరా!ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంటే తనే తిన్నగా బయటికి వచ్చి అసలు మీరెవరు ఎందుకు నా వెంట పడుతున్నారు? హా.. అంటూ కోపంగా చూసింది . అబ్బా! మిమ్మల్ని ఒక్కసారి  చాలండి . అన్నాను సడన్ గా నాకు గుర్తొచ్చింది  నా బాగ్   విషయం . నా ఆందోళన  వాళ్ళమ్మగారు ఏమైయ్యింది బాబూ అడిగారు .  అంత కోపంలోనూ వాళ్ళు అలా అడిగేసరికి  నాకు కన్నీళ్లు ఆగలేదు .వాళ్ళిద్దరూ కంగారుగా నా వైపు చూస్తుంటే నేను చెప్పాను నా బాగ్ విషయం . ఇద్దరు ఒక్కసారి నవ్వేసారు గట్టిగా .  సరే మా డాడ్ సికింద్రాబాద్ లో  ట్రైన్లో  ఉన్నారు . కోచ్ నెంబర్ చెప్పండి  అంది.
నా కోచ్ నెంబర్ ఎస్ 6 అని చెప్పాను. సరే డాడీ ని కూడా నేనే ఎక్కించాను .. బెర్త్ నెంబర్ అడిగింది తను 36 అని చెప్పాను . సరే అని  డాడీ కి  చేసి డాడీ  తెలిసిన ఒకాయన ఎస్ 6 బెర్త్ నెంబర్ 36 లో తన   బ్లాక్ కలర్ బాగ్ మరిచిపోయారట . కొంచెం  కలెక్ట్ చేసుకోండి . అని చెప్పి హమ్మయ్య మీకింత మతిమరుపు ఏమిటండీ  అంటూ నవ్వింది . నాకు తన నవ్వు చూస్తే ఏమనాలో అర్థం కావడంలేదు .
ఇంతలో వాళ్ళమ్మగారు టీ తెచ్చి ఇచ్చారు . నాకు  సంతోషం గా ఉంది . నా పేరు గోపాల్ అండి  అన్నాను . ఔనా ! నేను అడగ లేదే అంది తను . మళ్లీ  అదే నవ్వు. మీ పేరు తెలుసుకోవచ్చా ? అడిగాను . ఎందుకు ? అడిగింది . ఏం చెప్పాలో తెలియదు. తన నవ్వు చూస్తే నాకు గొంతు ఎండిపోతోంది . వెర్రి వాడిలా ఒక్క నవ్వు నవ్వాను. నా పేరు సుప్రియ అంది తను. నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది . ఇంత అందమైన అమ్మాయికి ఇంత మంచి పేరు పెట్టిన ఆ తల్లిదండ్రులకి మనసులోనే జోహార్ చెప్పుకున్నాను . సుప్రియ నాది అని చెప్పుకున్నాను . ఇంతలో వాళ్ళమ్మగారు వచ్చి బాబూ ! నీ బాగ్ రేపు మార్నింగ్ వస్తుంది  అన్నారు . అంటే నన్ను వెళ్ళమని చాల గౌరవంగా చెప్పినట్లే అనుకున్నాను . సరే వెళ్ళొస్తా నండి . అంటూ నిలబడ్డాను . ఎక్కడికి వెళ్తావు బాబూ . రాత్రికి ఇక్కడే ఉండి  ఉదయాన్నే బాగ్ తీస్కొని వెళ్ళు అన్నారు . ఇంతలో సుప్రియ వాళ్ళ డాడీ ఫోన్ చేసి బాగ్ తీసుకున్నానని చెప్పారు . డాడీ తను నాకు బాగా తెలిసిన అబ్బాయి . రాత్రి ఇక్కడే పడుకోమని అమ్మ కూడా చెప్పింది అంది . అలాగే తల్లీ అన్నారు ఆయన .
సుప్రియ గారు నేనెవరో మీకు తెలియనే కదా ఎలా ఉండమని చెప్తున్నారు  అడిగాను .ఉండండి అమ్మ చెప్పింది కదా అంది తను . దేవుడికి మనసులోనే థాంక్స్ చెప్పేసుకొని  కూర్చున్నాను . వాళ్ళమ్మగారు వచ్చారు . బాబూ లోపలి రా నాయనా అని పిలిచారు . నేను సిగ్గు పడుతూనే లోపల హాల్లో కూర్చున్నాను . అమ్మాయి ఇక్క్కడే కాలేజీ లో మాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తోంది బాబూ .. చెప్పారు ఆవిడ . నేను ఏం చేస్తున్నానో చెప్పమని ఆమె అడిగినట్లు ఫీల్ అయ్యి నేను హై స్కూల్ లో టీచర్ నండీ  చెప్పుకున్నాను . మంచిది బాబూ . అన్నారు . నాకో అక్క ఉందండీ  చెప్పాను . అమ్మా నాన్నా లేరండి అని చెప్పాను . సరే ఇక్కడే భోజనం చేసి పడుకో ఉదయం బాగ్ వచ్చాక వెళ్ళొచ్చు సరేనా అన్నారు . అయ్యో బయట తింటానండీ  చెప్పాను నిజాయతీగా . పర్లేదు మాకేం తరిగి పోదులే ఇక్కడే తిని పడుకో సరేనా అంది సుప్రియ. తను  ఏక వచనం లో పిలవడాన్ని కొంచెం బాధగా ఫీల్ అయ్యాను . సుప్రియా ! తప్పమ్మా అలా  అనొచ్చా . అని వాళ్ళమ్మగారు మందలించారు . పరవాలేదండీ  అన్నాను కానీ లోపల లోపల కాలిపోతోంది .  హేయ్య్ అమ్మా తను నాకంటే చిన్న జాబు కదా నేను అనొచ్చు చెప్పింది సుప్రియ . నేనో వెర్రి నవ్వు నవ్వేసి పెట్టింది తినడానికి లేచాను .పళ్ళెం ముందు  కూర్చున్నా .  ఎదురుగా కూర్చుంది తినడానికి . వాళ్ళమ్మగారు పళ్ళెం లో వడ్డించింది చూసాకా విషయం తెలిసింది .ఏదో నాన్ వెజ్ వండి వడ్డించారు . అయ్యో నేను వెజ్ ఓన్లీ.  ఏమీ అనుకోకండీ ! అన్నాను . సుప్రియ నవ్వుతోంది . సుప్రియా ! తప్పమ్మా అలా నవ్వోచ్చా . వాళ్ళమ్మగారు దెబ్బలాడారు .
 సారీ బాబూ ఏం అనుకోకు. కూర  చేసేస్తా చిటికెలో అన్నారు . ఖర్మరా బాబూ దొరికేసాను మనసులో తిట్టుకుంటూ వద్దండీ నేను పెరుగు తప్ప ఇంకేం కలుపుకొను అని చెప్పేసా . నన్ను ఇబ్బంది  ఇష్టం లేక సరే అని అదే వడ్డించారు . ఇలా తింటే నువ్వెలా జాబు చేస్తావ్ . చూడు నేనెలా పీక్కుంటూ తింటున్నానో అంది . ఎలాగో భోజనం ముగించి మళ్లీ హాల్లోకి వచ్చి కూర్చున్నాం . టీవీ చూస్తూ ఉంటే సుప్రియ అడిగింది గోపి నీ ఏజ్ ఎంత అడిగింది . 26 అన్నాను .
నీ గురించి చెప్పు అంది . బాబూ నువ్వు దొరికేసావ్ దానికి.  పడుకో  అన్నారు వాళ్ళమ్మగారు . పర్లేదండీ  అన్నాను , నాది శ్రీకాకుళం జిల్లా లో ఒక మారుమూల ఊరు . నాకు అక్క తప్ప ఇంకెవ్వరు లేరు . తను కూడా టీచరే . చెప్పాను . నేను ఇంగ్లీష్ టీచర్ ని అని చెప్పాను. సరే ఎందుకు వచ్చావు . అడిగింది . ఏమో మిమ్మల్ని చూడగానే ట్రైన్ దిగేసాను  నాకు ఏం  జరిగిందో కూడా తెలీదు చెప్పాను . ఓహో  లవ్వా అడిగింది .
నా గుండెలో రాయి పడింది . నోట్లో మాట రావడం లేదు . తను విచిత్రం గా నవ్వి లేచి వెళ్లి త్రాగడానికి నీళ్ళు తెచ్చి ఇచ్చింది . ఓహో గోపి ఇది లవ్వే . అంది తను నవ్వుతూ. అవునా అలా ఐతే నా కంటే లక్కీ ఎవరు అన్నాను . అనేసాను అనుకున్నాను కానీ నోట్లో మాట బయటకి రానే లేదు . షాకా ? అడిగింది
తనే చెప్పింది నేను నీకంటే పెద్దదాన్ని .కాబట్టి మనిద్దరికీ కుదరదు . అంది . నేనేమి మాట్లాడలేదు ..... (సశే షం )