నా డైరీ లో కొన్ని పేజీలు
రాత్రంతా ఇద్దరం మాట్లాడుతూనే ఉన్నాం . కానీ వాళ్ళమ్మగారు మమ్మల్ని ఏమీ అనలేదు . నాకు చాల ఆశ్చర్యం కలిగింది . అదే విషయం అడిగాను తనని . తను చిన్నగా నవ్వేసి చెప్పింది . ఇంట్లో తను ఏం చెప్తే అదే చేస్తారట . తను అంటే వాళ్ళమ్మా నాన్నలకి ప్రాణమట . అప్పుడు కొంచెం నోరు తెరిచాను . "సుప్రియా ! నిన్ను ఎందుకు చూసానో తెలీదు . నాకు నువ్వు కావాలి . ప్లీజ్ కాదని అనకు" అన్నాను . "అబ్బా ! అదే ఎందుకు చెప్పు" అంది తను . "నేను చెప్పలేను . కాని నా మనసులో మాట నీకు చెప్పేసాను", అని అన్నాను . "నేను నీకంటే ఏజ్ లో పెద్దదాన్ని . మన ఇద్దరి కాస్ట్ ఒక్కటి కాదు . గోపీ ! నా మీద అంత ఆశ పెట్టుకోకు" అంది . "సుప్రియా ! నాది ప్రేమే తప్ప నీ మీద కోరిక కాదు సుప్రియా ! సరే నీ ఇష్టం . కానీ ఏదో ఒక్క రోజు నా ప్రేమని నువ్వు ఫీల్ అవుతావు" అని చెప్పి నేను గుడ్ నైట్ చెప్పి పడుకున్నా . నాకు తెలుసు తను ఎట్టి పరిస్థితిలోనూ నాదే అని . నా మనసులో చిన్నగా నవ్వు . దుప్పటి ముఖం పైకి లాక్కున్నా . సుప్రియ ఒక్కక్షణం అలా చూస్తుందని నాకు తెలుసు . తర్వాత తను ఏం చేస్తుందో తెలుసు .
ఒక్క క్షణం ... ఇంకో క్షణం ... సుమారు ఐదు నిముషాలు . ... నాకు చిన్న అనుమానం .... నా టైమింగ్ మీద నాకు మొదటిసారి అనుమానం . సరిగ్గా అప్పుడే తను నా ముఖం మీది దుప్పటి లాగింది . "నువ్వలా చెప్పేసి పడుకుంటే .... నాకెలా నిద్ర పడుతుంది . మా ఇంటికి వచ్చావు . నన్నే డౌట్ లో పడేసావు . నువ్వు మాట్లాడకపోతే ఎలా"? అంది . "ఏం మాట్లాడాలి"? అడిగాను . "గోపీ ! వద్దురా .. కావాలంటే మనం ఫ్రెండ్స్ గా ఉందాం" ... తనే చెప్పింది ."అయినా నువ్వెవరో నేనెవరో తెలీకుండా ఇదంతా ఏమిటి అసలు .. నువ్వంటే నాకు ఇష్టం లేదు .... నేను ఇప్పటికే పెళ్లి చేసుకున్నాను . మా అయన ముంబై లో బిజినెస్ చేస్తున్నారు" ... అంది . "హహహ అవునా! సరే ఐతే పడుకో తనని తలుచుకొంటూ" . అని మళ్ళీ దుప్పటి ముఖం మీదికి లాక్కున్నాను . "హేయ్ ! నీకేమైనా మతి పోయిందా . నాకు పెళ్ళి అయ్యిందిరా. చెప్తే వినవా" ? అంటూ మళ్ళీ ముసుగు లాగింది . "తన పేరు పేరు రంజిత్ . ముంబై లో బిజినెస్ చేస్తున్నారు" . అంది . "సరే ! పడుకో", చెప్పాను .
తనకి ఏం చెప్పాలో అర్థం కాలేదని తెలుసు . కొంచెం సేపు అక్కడేకూర్చొని లేచింది . వెళ్తూ వెళ్తూ నా వైపు చూసి లైట్ ఆఫ్ చేసింది . చేసి మల్లి తిన్నగా వచ్చి సోఫా దగ్గర నిలబడి నా నెత్తి మీద ఒక్కటి మొట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది . మర్నాడు సరిగా మధ్యానం టైం కి సుప్రియా వాళ్ళ నాన్నగారు వచ్చేసారు . నా బాగ్ కోసం నేను ఆత్రంగా చూస్తున్నానని తెలుసుకొని నవ్వుకున్నారు . సుప్రియే మా ఇద్దరికీ పరిచయాలు చేసింది . నాకు ఒక విషయం అర్థం కాలేదు . తను నన్ను క్లాస్ మేట్ గా పరిచయం చేసింది . వాళ్ళ అమ్మగారు కూడా తలఊపుతూ .. బాబు చాల మంచివాడు లాగా ఉన్నాడండీ .. అంటూ చెప్పారు . ఈ సడన్ ట్విస్ట్ నాకు అర్థం కాలేదు . బుర్ర గోక్కున్నాను . "రేపు వెళ్ళొచ్చు లే బాబూ" .. అన్నారు తను . "లేదు సర్ .. పనులున్నాయండి" .అంటూ బయలుదేరాను . "సుప్రియ గారు వెళ్ళొస్తానండీ .. మీ రంజిత్ గారిని అడిగానని చెప్పండి", అన్నాను వత్తి పలుకుతూ . .... సుప్రియ వాళ్ళ నాన్న వెనక్కి చేరి దండం పెడుతూ "వెళ్ళరా బాబూ" అంటోంది . నేను చిరునవ్వుతో . . . . "మీ అల్లుడుగారు ఎప్పుడొస్తారు? సర్" అన్నాను . తను ఒక చేత్తో నెత్తికొట్టుకుంటూ వేగంగా అక్కడినుండి లోపలి పరిగెత్తింది . మా అమ్మాయికి పెళ్లి కాలేదు బాబూ ... అయోమయంగా చెప్పారు వాళ్లనాన్నగారు . "మీ అల్లుడుగారి పేరు కూడా రంజిత్ అని తనే చెప్పారండీ" .. అమాయకం గా చెప్పాను . తనేమో దండం పెడుతోంది మాట్లాడవద్దని . "అవునా ... తల్లీ ఇలా రా" .. పిలిచారు . తను పిల్లిలా అడుగులో అడుగేసుకుంటూ వచ్చింది . "నాకు చెప్పకుండా ఇంత పని చేస్తావా? పోనీ రంజిత్ ని రమ్మని పిలుద్దామా" ? అడిగారు .తన చెవిని పట్టుకొని మెలిపెట్టారు . తనేమో నా వైపు కోపంగా చూస్తూ నవ్వుతోంది . "సరే బాబూ నువ్వెళ్ళి రా" అన్నారు . అయిష్టంగానే బయలుదేరాను . నాన్నా "నేను తనని ట్రైన్ వరకు వెళ్లి సెండ్ ఆఫ్ ఇచ్చి రావద్దా . అంది ... సరే వెళ్లి జాగ్రత్తగా వచ్చెయ్యి తల్లీ .. అన్నారు . కొంచెం దూరం వెళ్ళాక అడిగాను డాడి తో అల చెప్పావేం అని . తను ఒక్క నవ్వు నవ్వి ఊరుకుంది . సుప్రియా ! ఐ లవ్ యు ..మళ్ళీ చెప్పాను . తను మౌనంగా నా వేపు చూసింది . తన చూపులో బాధ ఉంది . సుప్రియా అక్క ని పంపనా ? అడిగాను . తనేం చెప్పలేదు . అడ్రస్ ఇస్తావా నీది .. అడిగాను . సరే అని తను చెప్పింది .
అడ్రస్ నోట్ చేసుకున్నాను . సుప్రియా! అక్క వివరాలు చెప్తుంది . వెళ్ళొస్తా అన్నాను . గోపీ! అంటూ చెయ్యి ముందుకు చాపింది . షేక్ హ్యాండ్ కోసం . నేను తన చెయ్యిని ఒకసారి నొక్కి వదిలాను .సుప్రియా ! నేను వెళ్ళొస్తా ! అంటూ ముందుకు కదిలాను . గోపీ ! ఒక్కపూట పరిచయం రా మనది . అది మర్చిపోకు అంది .సుప్రియా ! అక్క వస్తుందిరా మాట్లాడుతుంది . అప్పడైనా నీ ఒపీనియన్ చెప్పవా అడిగాను .సరే .. చూద్దాం .అంది తను .
నేను జర్నీ ముందుకు సాగనివ్వకుండా తీరిగి ఇంటికి చేరుకున్నాను . అక్క ఎప్పటిలా ప్రయాణం విశేషాలు అడిగింది . నేను ముందుకు ప్రయాణం చెయ్యలేదని చెప్పి సుప్రియ విషయం తనకు చెప్పాను. ప్రయాణం అర్థంతరం గా ఆగిపోయినందుకు అక్క కి కోపం రాలేదు కానీ , చిన్నా నువ్వు వెళ్ళిన పనేంటి , చేసిన పనేంటి , అంటూ కోప్పడింది . నాకు తెలుసు అక్క కోపం తాత్కాలికం అని. మాట్లాడకుండా అక్క ఒళ్లో తల పెట్టుకొని అక్క ముఖంలోకి చూస్తూ అక్కా నాకు సుప్రియని తెచ్చి ఇవ్వవా ? తను కావాలి నాకు అంటూ ఉంటే ... ఛ .. అలా అనకురా నాకు మాత్రం తమ్ముడు వద్దా ... సరే చూద్దాంలే . అంది . అక్క సరే అంటే ఆ పని ఐపోతుందని నాకు తెలుసు . బావగారు కూడా అక్క మాట కి కాదనరని నాకు తెలుసు. చిన్నా ! వెళ్ళి రెస్టు తీసుకో .. నేను వంట చేసి పిలుస్తాను . సరే నా అంది . అక్క చాల తీవ్రం గా ఆలోచిస్తోందని నాకు తెలుసు. మౌనంగా లేచి బయటకి వెళ్తుంటే తనే పిలిచింది .. బయటకి వెళ్ళకు మాట్లాడే పని వుంది అని. కొంచెంసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నాను . ఇంతలో తను వచ్చి నా ముందు చైర్లో కూర్చొని .. చెప్పరా విషయం అంది . నేను ఒక్క విషయం కూడా వదలకుండా అన్ని చెప్పేసా ..ఐతే ఆ అమ్మాయి బ్రాహ్మిన్ కాదు . మరి నువ్వు చేసుకుంటే మన పరువు ఏమౌతుందో తెలుస్తోందా ... నువ్వు చదువుకున్నావు .. కాని మన చుట్టూ సొసైటీ వుంది నాన్నా ! ఆలోచించావా ? అడిగింది కూల్ గా .
నేనేం మాటలాడలేదు . ఇంతలో బావగారు వచ్చేసారు . అక్క తమ్ముళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారా ? అంటూ .బావ గారూ ! బావున్నారా? అడిగాను ఎప్పుడొచ్చారు . అడిగారు బావగారు . వీడేం ఘనకార్యం చక్కపెట్టుకొచ్చాడో అడగండి . అంది అక్క ... నేను మౌనంగా వున్నాను .. ఏమయ్యింది అడిగారు బావగారు . అక్క పగలబడి నవ్వుతోంది . వీడో ప్రేమ పిచ్చోడు .. హహహహహ్ ..... అక్కడ వరంగల్ స్టేషన్ లో ఒకమ్మాయిని చూసాడట . బాగ్ కూడా మర్చిపోయి దిగేసి తన వెంట పడ్డాడట ..... ఇదిగో ఇప్పుడొచ్చి నాకేం తెలీదు అమ్మాయిని నాకు తెచ్చి ఇవ్వు అంటూ ఇదిగో గొడవ .. భోజనం తిను అంటే వద్దట .. స్నానం లేదు .. ఒకటే సతాయింపు .. అబ్బా! చెప్పండి మీరైనా ! అంది అక్క . అవునా ... ఇంకేం మనకి శ్రమ కదా ..... హహహహహ చూడు మీ తమ్ముడు ఎంత తెలివైన చేసాడో ! నవ్వుతున్నారు బావగారు. నాకు అక్క మీద చాల కోపం వచ్చింది . సరే అక్కా నా పరువు తీసేసావు ... నేను వెళ్తున్నా ..... అన్నాను .. అక్క బావగారు బ్రతిమలాడుతారని .... సరే రా ఐతే , వెళ్లి రా నాకూ పనిఉంది . నువ్వు బయలు దేరితే తలుపు వేసుకోవాలి . వంట గదిలోంచే అక్క సమాధానం విని నా నోరు మూతపడింది . మౌనంగా బాగ్ తీసుకున్నాను .. సరే బావగారు వెళ్ళొస్తా ... అంటూ బయటకి వచ్చాను . ఎక్కడికి వెళ్ళను .. ఆలోచిస్తున్నాను .. ఒరేయ్ తమ్ముడూ ! సరదాగా అంటే నిజంగా వెళ్తావా .. వెధవా ! .. రా లోపలకి అంటూ తీసుకొని వెళ్ళింది .. సరే అమ్మాయి మన కులం కాదు మరి మనవాళ్ళు అడిగితే ఎలా చెప్పాలి .. ఏమండీ మాట్లాడరేం అంది బావగారితో .. సరే ఇప్పుడేం చేద్దాం .. అన్నారు బావగారు .
అక్కా ప్లీజ్ నా మాట వినవా నాకు తను కావాలక్కా ... నువ్వేం చేస్తావో తెలీదు తనని ఎలాగైనా తీసుకొని రా అక్కా ! బ్రతిమలాడుతుంటే ... అబ్బా ఉండరా ఆలోచించుకోనీ .. అంది . సరే ఇవ్వాళ వద్దులే .. రేపు ఉదయాన్నే ట్రైన్ ఎక్కేసి వెళ్ళండి మళ్లీ తనని తీస్కొని వెంటనే సాయంత్రానికి వచ్చెయ్యండి అన్నాను.. ఏంట్రా ! ఇవ్వాళ వద్దా.. రేపు ఉదయాన్నే వెళ్లి తనని తీస్కొని వెంటనే వచ్చేయాలా .. అబ్బా మాకు మంచి ఛాన్స్ ఇచ్చావు కదరా.. తను అమ్మాయి అనుకుంటున్నావా లేక బొమ్మ అనుకుంటున్నావా. .... నవ్వుతోంది అక్క ..
అక్కా ! ఎలాగైనా నాకు ఆ అమ్మాయిని తెచ్చి ఇవ్వవా .. తను లేకపోతే నా గుండెల్లో చాలా నొప్పిగా వుందక్కా .. తను నాకోసమే పుట్టిందక్కా .... చిన్నా ! ఊరుకోరా .. నువ్వు ఏడిస్తే నాకేం చెయ్యాలో తెలీడం లేదురా ..... నేను నీ మాట కాదని ఎప్పుడైనా అన్నానా .. కొంచెం ఆలోచించుకోనివ్వు నాన్నా ..! అక్కా లేట్ అయిపోతే తనకి పెళ్లి అయిపోతుందక్కా ... అబ్బా ... నువ్వు కొంచెం ఉంటావా మేమిద్దరం ఆలోచిస్తున్నాం కదా ! నువ్వెళ్ళి పనులుంటే చేస్కో .. అంటూ బావగారు కూడా అనేసరికి ఏం చెప్పాలో తెలియలేదు నాకు . మౌనం గా బయటకి నడిచాను .. అయ్యో పాపం వాణ్ణి అలా ఎందుకు అన్నారు .. ఎంత బాధపడుతున్నాడో ! కొన్ని రోజులైతే తను ఎలాగూ ట్రైనింగ్ కి వెళ్ళిపోతాడు కదా .. అని అక్క అనడం నాకు వినిపించింది . అదేంటి ప్రఫుల్లా ! అలా అంటావ్ తను నీకు తమ్ముడైతే నాకు ఇంకా ఎక్కువ .. నా బావ మరిది ఐఏఎస్ అని చెప్పుకోడం నాకు మాత్రం గర్వం కాదా ? అన్నారు .. సరే .. ఇప్పుడు ఏం చేద్దాం .. అడిగారు బావగారు .. రేపు ఉదయం వెళదాం .. ఏదో ఒకటి మాట్లాడకపోతే వాడికి సంతోషం గా వుండదు కదా ! అంది అక్క. సరే ఐతే తనకి చెప్పు అన్నారు . అవసరం లేదు అంది అక్క .మర్నాడు ఉదయాన్నే ఇద్దరూ బయలు దేరారు .. నాకైతే మనసులో చాల హ్యాపీ గా వుంది . అక్క వెళ్తే నా పని ఐపోతుందని నాకు నమ్మకం ఉంది . కాని కొంచెం దిగులుగా వుంది .. "సుప్రియా ! నా ప్రేమని కాదనకు" .. అని మనసులో అనుకున్నాను కనీసం వెయ్యిసార్లు ..

No comments:
Post a Comment