Wednesday, 2 December 2015

                                                           నా డైరీ లో  కొన్ని పేజీలు

బహుశా  ఈ పేజీ నేను తెరిచి పెడతానని మా అక్క ఊహించి ఉండదు . మా అక్కకి ఇష్టం లేని పేజీ ఇదే అని నా నమ్మకం .
              "అది 2013 వ సం . మార్చి నెల 22 వ తారీఖు. నేను విశాఖపట్నం  నుండి సికింద్రాబాద్ వెళ్ళే  ట్రైన్లో    ప్రయాణం     చేస్తున్నా.  వరంగల్ స్టేషన్ కి చేరుకోనేసరికి టైం సాయంత్రం నాలుగు దాటింది . ఎందుకో నా ద్రుష్టి ప్లాట్ ఫాం మీదికి మళ్ళింది . ఒక్కసారి అదిరిపడ్డాను .. కారణం ఒక అందాలరాశి నాకు ప్రత్యక్షం కావడమే . నేను ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా ట్రైన్ దిగేశాను . పరిగెత్తుకుంటూ వెళ్లి తనముందు నిలబడ్డాను . ఆయాసం తో రొప్పుతూ తన ముందు నిలబడ్డాను .  తను చిరునవ్వుతో నా వైపు చూసింది .. కళ్ళెగరేస్తూ.  ఏం కావాలన్నట్లు .  ఆ కళ్ళల్లో ఆకర్షణ శక్తీ వర్ణించలేనిది .
ఐ లవ్ యు అన్నాను . తను ఆశ్చర్యపడి వ్హాట్? అంటూ లేచి నిలబడింది . గబగబా  లేచి అక్కడినుండి విసురుగా వెళ్ళిపోయింది .   నేను ఒక్కక్షణం కూడా వృధా చెయ్యకుండా తనని అనుసరిస్తూ నడవసాగాను .  చివరికి తనో  ఇంట్లో కి దూరింది .
నేను తనని ఫాలో అవుతున్నాను .. తిన్నగా తను వెళ్ళిన ఇంట్లోకి వెళ్లి గుమ్మం దగ్గర ఆగిపోయాను . ఇంతలో ఒక పెద్దావిడ వచ్చి ఏయ్ ఎవరు నువ్వు అంటూ అడిగారు .  తెలిసినంతవరకూ తను ఈ అమ్మాయి కి అమ్మ కావచ్చు . ఏం లేదండి .  ఇప్పుడొక ఆమె వచ్చారు కదా వారిని ఒక్కసారి చూసి వెళ్లాలని  వచ్చాను . అని చెప్పాను .
ఎవరు నువ్వు అసలు ఎందుకు వచ్చావు అడిగారు ఆమె . నేను చాల దూరం నుండి వస్తూ  ఆమెను చూసానండి అన్నాను .   ఐతే ఇప్పుడేమంటావ్ అడిగారు ఒక్కసారి తనని చూసి వెళ్తా ప్లీజ్ అన్నాను . నీకేమైన మతి పోయిందా అడిగారు ఆమె . నాకు నోట్లో మాట కూడా రావడం లేదు .
బాబూ  మేము చాలా సంతోషం గా బతుకుతున్నాం . మమ్మల్ని ఇలా వుండనివ్వవు . అయినా నీకేం అపకారం చేసాం మేము . ఇలా వెంటపడ్డం ఏమైనా బాగుందా?అన్నారు .. ఏమండీ! తనని ఒక్కసారి చూడనివ్వరా!ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంటే తనే తిన్నగా బయటికి వచ్చి అసలు మీరెవరు ఎందుకు నా వెంట పడుతున్నారు? హా.. అంటూ కోపంగా చూసింది . అబ్బా! మిమ్మల్ని ఒక్కసారి  చాలండి . అన్నాను సడన్ గా నాకు గుర్తొచ్చింది  నా బాగ్   విషయం . నా ఆందోళన  వాళ్ళమ్మగారు ఏమైయ్యింది బాబూ అడిగారు .  అంత కోపంలోనూ వాళ్ళు అలా అడిగేసరికి  నాకు కన్నీళ్లు ఆగలేదు .వాళ్ళిద్దరూ కంగారుగా నా వైపు చూస్తుంటే నేను చెప్పాను నా బాగ్ విషయం . ఇద్దరు ఒక్కసారి నవ్వేసారు గట్టిగా .  సరే మా డాడ్ సికింద్రాబాద్ లో  ట్రైన్లో  ఉన్నారు . కోచ్ నెంబర్ చెప్పండి  అంది.
నా కోచ్ నెంబర్ ఎస్ 6 అని చెప్పాను. సరే డాడీ ని కూడా నేనే ఎక్కించాను .. బెర్త్ నెంబర్ అడిగింది తను 36 అని చెప్పాను . సరే అని  డాడీ కి  చేసి డాడీ  తెలిసిన ఒకాయన ఎస్ 6 బెర్త్ నెంబర్ 36 లో తన   బ్లాక్ కలర్ బాగ్ మరిచిపోయారట . కొంచెం  కలెక్ట్ చేసుకోండి . అని చెప్పి హమ్మయ్య మీకింత మతిమరుపు ఏమిటండీ  అంటూ నవ్వింది . నాకు తన నవ్వు చూస్తే ఏమనాలో అర్థం కావడంలేదు .
ఇంతలో వాళ్ళమ్మగారు టీ తెచ్చి ఇచ్చారు . నాకు  సంతోషం గా ఉంది . నా పేరు గోపాల్ అండి  అన్నాను . ఔనా ! నేను అడగ లేదే అంది తను . మళ్లీ  అదే నవ్వు. మీ పేరు తెలుసుకోవచ్చా ? అడిగాను . ఎందుకు ? అడిగింది . ఏం చెప్పాలో తెలియదు. తన నవ్వు చూస్తే నాకు గొంతు ఎండిపోతోంది . వెర్రి వాడిలా ఒక్క నవ్వు నవ్వాను. నా పేరు సుప్రియ అంది తను. నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది . ఇంత అందమైన అమ్మాయికి ఇంత మంచి పేరు పెట్టిన ఆ తల్లిదండ్రులకి మనసులోనే జోహార్ చెప్పుకున్నాను . సుప్రియ నాది అని చెప్పుకున్నాను . ఇంతలో వాళ్ళమ్మగారు వచ్చి బాబూ ! నీ బాగ్ రేపు మార్నింగ్ వస్తుంది  అన్నారు . అంటే నన్ను వెళ్ళమని చాల గౌరవంగా చెప్పినట్లే అనుకున్నాను . సరే వెళ్ళొస్తా నండి . అంటూ నిలబడ్డాను . ఎక్కడికి వెళ్తావు బాబూ . రాత్రికి ఇక్కడే ఉండి  ఉదయాన్నే బాగ్ తీస్కొని వెళ్ళు అన్నారు . ఇంతలో సుప్రియ వాళ్ళ డాడీ ఫోన్ చేసి బాగ్ తీసుకున్నానని చెప్పారు . డాడీ తను నాకు బాగా తెలిసిన అబ్బాయి . రాత్రి ఇక్కడే పడుకోమని అమ్మ కూడా చెప్పింది అంది . అలాగే తల్లీ అన్నారు ఆయన .
సుప్రియ గారు నేనెవరో మీకు తెలియనే కదా ఎలా ఉండమని చెప్తున్నారు  అడిగాను .ఉండండి అమ్మ చెప్పింది కదా అంది తను . దేవుడికి మనసులోనే థాంక్స్ చెప్పేసుకొని  కూర్చున్నాను . వాళ్ళమ్మగారు వచ్చారు . బాబూ లోపలి రా నాయనా అని పిలిచారు . నేను సిగ్గు పడుతూనే లోపల హాల్లో కూర్చున్నాను . అమ్మాయి ఇక్క్కడే కాలేజీ లో మాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తోంది బాబూ .. చెప్పారు ఆవిడ . నేను ఏం చేస్తున్నానో చెప్పమని ఆమె అడిగినట్లు ఫీల్ అయ్యి నేను హై స్కూల్ లో టీచర్ నండీ  చెప్పుకున్నాను . మంచిది బాబూ . అన్నారు . నాకో అక్క ఉందండీ  చెప్పాను . అమ్మా నాన్నా లేరండి అని చెప్పాను . సరే ఇక్కడే భోజనం చేసి పడుకో ఉదయం బాగ్ వచ్చాక వెళ్ళొచ్చు సరేనా అన్నారు . అయ్యో బయట తింటానండీ  చెప్పాను నిజాయతీగా . పర్లేదు మాకేం తరిగి పోదులే ఇక్కడే తిని పడుకో సరేనా అంది సుప్రియ. తను  ఏక వచనం లో పిలవడాన్ని కొంచెం బాధగా ఫీల్ అయ్యాను . సుప్రియా ! తప్పమ్మా అలా  అనొచ్చా . అని వాళ్ళమ్మగారు మందలించారు . పరవాలేదండీ  అన్నాను కానీ లోపల లోపల కాలిపోతోంది .  హేయ్య్ అమ్మా తను నాకంటే చిన్న జాబు కదా నేను అనొచ్చు చెప్పింది సుప్రియ . నేనో వెర్రి నవ్వు నవ్వేసి పెట్టింది తినడానికి లేచాను .పళ్ళెం ముందు  కూర్చున్నా .  ఎదురుగా కూర్చుంది తినడానికి . వాళ్ళమ్మగారు పళ్ళెం లో వడ్డించింది చూసాకా విషయం తెలిసింది .ఏదో నాన్ వెజ్ వండి వడ్డించారు . అయ్యో నేను వెజ్ ఓన్లీ.  ఏమీ అనుకోకండీ ! అన్నాను . సుప్రియ నవ్వుతోంది . సుప్రియా ! తప్పమ్మా అలా నవ్వోచ్చా . వాళ్ళమ్మగారు దెబ్బలాడారు .
 సారీ బాబూ ఏం అనుకోకు. కూర  చేసేస్తా చిటికెలో అన్నారు . ఖర్మరా బాబూ దొరికేసాను మనసులో తిట్టుకుంటూ వద్దండీ నేను పెరుగు తప్ప ఇంకేం కలుపుకొను అని చెప్పేసా . నన్ను ఇబ్బంది  ఇష్టం లేక సరే అని అదే వడ్డించారు . ఇలా తింటే నువ్వెలా జాబు చేస్తావ్ . చూడు నేనెలా పీక్కుంటూ తింటున్నానో అంది . ఎలాగో భోజనం ముగించి మళ్లీ హాల్లోకి వచ్చి కూర్చున్నాం . టీవీ చూస్తూ ఉంటే సుప్రియ అడిగింది గోపి నీ ఏజ్ ఎంత అడిగింది . 26 అన్నాను .
నీ గురించి చెప్పు అంది . బాబూ నువ్వు దొరికేసావ్ దానికి.  పడుకో  అన్నారు వాళ్ళమ్మగారు . పర్లేదండీ  అన్నాను , నాది శ్రీకాకుళం జిల్లా లో ఒక మారుమూల ఊరు . నాకు అక్క తప్ప ఇంకెవ్వరు లేరు . తను కూడా టీచరే . చెప్పాను . నేను ఇంగ్లీష్ టీచర్ ని అని చెప్పాను. సరే ఎందుకు వచ్చావు . అడిగింది . ఏమో మిమ్మల్ని చూడగానే ట్రైన్ దిగేసాను  నాకు ఏం  జరిగిందో కూడా తెలీదు చెప్పాను . ఓహో  లవ్వా అడిగింది .
నా గుండెలో రాయి పడింది . నోట్లో మాట రావడం లేదు . తను విచిత్రం గా నవ్వి లేచి వెళ్లి త్రాగడానికి నీళ్ళు తెచ్చి ఇచ్చింది . ఓహో గోపి ఇది లవ్వే . అంది తను నవ్వుతూ. అవునా అలా ఐతే నా కంటే లక్కీ ఎవరు అన్నాను . అనేసాను అనుకున్నాను కానీ నోట్లో మాట బయటకి రానే లేదు . షాకా ? అడిగింది
తనే చెప్పింది నేను నీకంటే పెద్దదాన్ని .కాబట్టి మనిద్దరికీ కుదరదు . అంది . నేనేమి మాట్లాడలేదు ..... (సశే షం )

No comments:

Post a Comment